»   » అనుష్క ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇలా..

అనుష్క ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘రుద్రమదేవి' చిత్ర నిర్మాణ సంస్థ ‘గుణ టీమ్ వర్క్స్' కార్యాలయంలో ఉమెన్స్ డే సందర్బంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ అనుష్క, రాగిణి గుణ, యాంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రమదేవి టీం స్పెషల్ వీడియో విడుదల చేసింది.

సినిమా విషయానికిస్తే...
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన పీరియాడికల్ సినిమా ‘రుద్రమదేవి'. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ఇది. గత సంవత్సరం డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగు, తమిళ, మళయాల వెర్షన్ లు సైతం ఇదే రోజున విడుదల చేస్తారు.స

Women's Day Celebrations at Gunaa Teamworks Office

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Women's Day Celebrations at Gunaa Teamworks Office smile emoticon. Watch Women's Day Special Video by Rudhramadevi Team.
Please Wait while comments are loading...