ఎస్పీ బాలు మృతిపై స్పందించని అమితాబ్.. సంతాపం ప్రకటించని బిగ్‌బీ.. కారణం ఏమిటోనని..
దేశం గర్వించదగిన గాయకుడు, సుప్రసిద్ధ సంగీతకారుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి దిగ్బ్రాంతికి గురిచేసింది. తమ అభిమాన గాయకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎస్పీ బాలుకు తమకు తోచిన విధంగా సోషల్ మీడియాలో స్పందించారు. ట్వీట్ల రూపంలోను, ఇన్స్‌టాగ్రామ్ పోస్టుల్లోనూ తమ అనుబంధాన్ని, ఆయన పాటపై ఉన్న అభిమానాన్ని చాటుకొన్నారు. కేవలం తెలుగు, తమిళ, కన్నడ భాషలకే పరిమితం కాలేదు. హిందీ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్లు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి వాళ్లు ట్వీట్ల ద్వారా బాలుకు శ్రద్ధాంజలి ఘటించి దిగ్గజ గాయకుడిని స్మరించుకొన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
ఇక అమితాబ్ విషయానికి వస్తే.. దాదాపు బాలీవుడ్‌లో సోషల్ మీడియాను ఉపయోగించే వారిలో అందరికంటే ముందుంటారు. సోషల్ మీడియాలోని అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌పై చురుకుగా స్పందిస్తుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కూడా ఆయన ట్వీట్లు చేయడం తెలిసిందే. అయితే బాలు మరణం తర్వాత బాలీవుడ్ మొత్తం స్పందిస్తే.. బిగ్ బీ మాత్రం మౌనంగా ఉండటంపై సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

24 గంటల్లో అనేక రకాల ట్వీట్లు
బాలు మృతిపై బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఎందుకు స్పందించలేదనే హాట్ టాపిక్‌గా మారింది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బిగ్‌బీ.. బాలు మరణంపై ఓ ట్వీట్ గానీ, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టుగానీ, ఓ మాటగానీ ఎక్కడ చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. గడచిన 24 గంటల్లో ఫుట్‌బాల్ క్రీడల మీద, కేబీసీ 13 కార్యక్రమం మీద ట్వీట్లు చేయడం, రీట్వీట్లు చేయడం కనిపించింది. చివరకు ధోని గురించి కూల్ అంటూ కూడా ట్వీట్ చేశారు.

అమితాబ్ స్పందించకపోవడంపై
16 భారతీయ భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడి.. దేశ సినీ పరిశ్రమకు గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన బాలు గురించి అమితాబ్ ట్వీట్ చేయకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లోను, అభిమానుల్లోనూ చర్చనీయాంశమైంది. అమితాబ్‌కు ఈ వార్త తెలిసి ఉండకపోవచ్చనే ప్రశ్నే లేదనేది సినీ వర్గాల వాదన. బాలుపై అమితమైన గౌరవం కారణంగా బాధతో ట్వీట్ చేయలేదా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై చర్చ జరుగుతున్నది.
Recommended Video

మృత్యువుతో పోరాడుతూ..
కరోనావైరస్ పాజిటివ్‌తో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎంలో హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత అంటే ఆగస్టు 13వ తేదీ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కోలుకొన్నట్టే కనిపించిన ఆయనకు గత రెండు రోజుల క్రితం ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ సంగీత ప్రపంచం శ్రద్దాంజలి ఘటిస్తున్నది.


Click it and Unblock the Notifications











