»   »  రత్నంలాంటి మనిషి, మనసు బంగారం.. అంటూ చిరుని

రత్నంలాంటి మనిషి, మనసు బంగారం.. అంటూ చిరుని

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి 'ఖైదీ నంబరు 150' చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ రాయ్‌లక్ష్మి ఆడిపాడుతున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవితో కలిసి నటించడం తన కల అని రాయ్‌లక్ష్మి అన్నారు.

చిన్నప్పటి నుంచీ తాను మెగాస్టార్‌కి అభిమానినని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు ఆయన నిదర్శనమని చెప్పారు.
'నిజమైన లెజెండ్‌! నేనే ప్రత్యక్ష ఉదాహరణ. రత్నంలాంటి మనిషి, మనసు బంగారం.. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు' అని రాయ్‌లక్ష్మి ట్వీట్‌ చేశారు.

 lakshmirai

దీంతోపాటు 'ఖైదీ నంబరు 150' సెట్‌లో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. చిరంజీవి కుమార్తె సుస్మిత తనని చక్కగా రెడీ చేశారని తెలుపుతూ.. తొలిరోజు షూటింగ్‌లో దిగిన ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్‌ నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. కామెడీ హీరో సునీల్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Raai lakxmi will be doing special song in telgu magastar chiranjeevi 150 th film and she says it feels surreal to get this opportunity. I have been his fan since my childhood .I m blown Away by his nature honor to working with him she says .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu