»   » తలైవా తొలి అడుగు ఇక్కడ కాదు ... భారత్ కంటే ముందు అమెరికాలోనే కబాలి

తలైవా తొలి అడుగు ఇక్కడ కాదు ... భారత్ కంటే ముందు అమెరికాలోనే కబాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కబాలి చిత్ర మొదటి షో అమెరికాలో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కబాలి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కబాలి. ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. చిత్ర టీజర్, పాటలు ఇప్పటికే విశేష ఆదరణను పొందడంతో రజనీకాంత్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.

'కబాలి' అమెరికాలో సంచలనంగా మారిందని అంటున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సినీ గెలాక్సీ కబాలి సినిమా అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. పా. రంజిత్ తెరకెలెక్కించిన ఈ చిత్రంలో రజనీ జోడీగా రాధికా ఆప్టే నటిస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా రజనీ సినిమా అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.


400 థియేటర్లలో ఈనెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమాకి ముందు రోజు ప్రీమియర్ షోలను కూడా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు.కబాలి టికెట్ల బుకింగ్ అమెరికాలో ఇప్పటికే మొదలైందని, మొదటి రెండు గంటల్లోనే టికెట్లు అమ్ముడుపోయాయని సిని గెలాక్సీ అధినేత మధు గార్లపాటి ప్రకటించారు.


World’s First Kabali Show in USA

ప్రీమియర్ షో టికెట్ ధర ను 25 డాలర్లుగా నిర్ణయించినట్టు చెప్పారు. గతంలో థేరీ, 24 చిత్రాలను కూడా సినీ గెలాక్సీ సంస్థే అమెరికాలో రిలీజ్ చేసింది. తెలుగు.. తమిళం రెండు భాష ల్లోనూ కబాలి మూవీని అమెరికాలో రిలీజ్ చేస్తుండటం విశేషం.


కాగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 22న విడుదలకు సిద్ధం అవుతోంది.,విశేషం ఏమిటంటే ఈ చిత్రం ఇండియాలో కంటే ముందుగానే అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికాలో విడుదల కానుంది. అమెరికాకు ఇండియాకు మధ్య కాల వ్యవధిలో వ్యత్యాసం ఉండడంతో భారత కాలమానం ప్రకారం కబాలి చిత్రం 21న ఉదయం 11 గంటలకు అమెరికాలో తొలి షో ప్రదర్శింపబడనుంది.


ఇంతకు ముందు ఏ చిత్రానికి లేని విధంగా దాదాపు 400 థియేటర్లలో కబాలి విడుదల చేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే తెలుగు, హిందీ భాషలతో పాటు మళయాలం భాషలో అనువాదం అయిన కబాలి చిత్రాన్ని ఇండోనేషియా, చైనా, థాయ్‌లాండ్, జపాన్ భాషల్లోనూ అనువదించి సెప్టెంబర్‌లో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందన్నది తాజా సమాచారం.

English summary
As per India time, the first show of Kabali will be screened at 11 AM on 21st July in the US, which is almost 20 hours ahead of film’s release in India. Kabali is releasing in as many as 400 screens across the US.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu