»   » యువరాజు సిద్దమయ్యాడు... ధోనీ కంటే యువీ మరింత బలంగా వచ్చేలా ఉన్నాడు

యువరాజు సిద్దమయ్యాడు... ధోనీ కంటే యువీ మరింత బలంగా వచ్చేలా ఉన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బయోపిక్ ఇప్పుడు బాలీవుడ్ లో కాసులు కురిపించే మంత్రం. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలైతే ఫ్రీగా పబ్లిసిటీ.., ముందే భారీ అంచనాలు ఉంటాయి. అందుకే రెజ్లర్లతో మొదలైనా క్రికెటర్ల పై వచ్చే సినిమాలవైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మేరీ కోం వచ్చినప్పటి నుంచే భారత్లో క్రీడా చిత్రాలకు మంచి మార్కెట్ ఉంటుందనే విసయం పసిగట్టారు సినీ పండితులు... ఇదే సూచనని ట్రేడ్ వర్గాలు కూడా దృవీకరించటం తో నెమ్మదిగా క్రీడాకారుల చరిత్రలని తవ్వి తీసి సినిమా కథలుగా మలచటం మొదలు పెట్టారు.

  బయోపిక్ ట్రెండ్ లో మరో స్పోర్ట్స్ మెన్ స్టోరీ రానున్నట్టు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఖాతాలో చేరుతున్న ఆటగాడు యూవీ. భయంకరమైన క్యాన్సర్‌తో పోరాడుతూనే 2011లో భారత్‌కు 28 ఏళ్ల తర్వాత రెండోసారి ప్రపంచకప్‌ రావడంలో ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ స్టోరీని సినిమాగా తీసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి ఈ మధ్య యూవీ అన్న మాటలే ఉదాహరణ అంటున్నారు సినీ విశ్లేషకులు.

  Would love to make a biopic on Yuvraj Singh: Says Abhishek Bachchan

  అంతే కాదు ఈ మధ్యనే బాలీవుడ్ యంగ్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ సూపర్ లీగ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అభిషేక్ ' ప్రస్తుతం బాలీవుడ్ లో వస్తున్న బయోపిక్స్ అన్నీ.., ఇన్స్ పైరింగ్ గా ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా యువరాజ్ సింగ్ జీవితకథ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.,,అతడి కెరీర్ లో చాలా విషయాలు ఉన్నాయి. వ్కక్తిగతంగా క్రీడాకారుడిగా ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొన్నాడు యువి. అతని జీవితకథ సినిమాగా రూపొందిస్తే మరింత ఇన్స్ పైరింగ్గా ఉంటుంది' అంటూ కామెంట్ చేశాడు

  అంతేకాదు మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం 'అజహర్‌' ఓవైపు వివాదాల్లో పడినా హీరో హిమ్రాన్‌ హష్మీ మాత్రం అప్పుడే యువీ సినిమా మీద ఇంట్రస్ట్ చూపించాడు. అజహర్ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మళ్లీ ఏ క్రికెటర్‌ బయోపిక్‌లో నటించాలనుకుంటున్నారని ఓ అభిమాని ప్రశ్నించగా.. తొలి టీ20 ప్రపంచకప్‌-లో ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌-లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్‌-సింగ్‌ జీవిత చిత్రంలో నటించడం తనకెంతో ఇష్టమని ఇమ్రాన్‌ జవాబిచ్చాడు. ధోని నేతృత్వంలో భారత్‌ రెండు ప్రపంచకప్‌ ట్రోఫీలు సాధించడంలో వెన్నెముకగా నిలిచి, క్యాన్సర్‌ పైనా విజయం సాధించి, జాతీయ జట్టులోకి వచ్చిన యువీ బయోపిక్‌ వస్తే గనక తనకు యువరాజ్ సింగ్ లా కనిపించాలని ఉందంటూ ఆశపడ్డాడు.

  Would love to make a biopic on Yuvraj Singh: Says Abhishek Bachchan

  యువరాజ్‌ ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తన బయోపిక్‌పై స్పందించాడు. 'నా జీవితాన్ని సినిమా ద్వారా వ్యక్తపరచడం నాకెంతో ఇష్టం' అన్నాడు. అయితే ప్రస్తుతం తన ప్రాధాన్యం క్రికెట్‌ ఆడడమని రిటైర్‌మెంట్‌ తర్వాత సినిమా గురించి ఆలోచిస్తా అన్నాడు. క్యాన్సర్‌తో చిన్నారులు బాధపడటం, వారికి చికిత్స చేయించి ఆర్థికంగా చితికిపోయిన పేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ఇబ్బందిపడటం గమనించిన యువీ వాళ్లకు అండగా నిలుస్తున్నాడు.

  'యువీ కెన్‌' ఫౌండేషన్‌ ద్వారా సుమారు ఆరొందల మంది చిన్నారులకు చదువు చెప్పిస్తున్నాడు. మొదట్లో జల్సా జీవితం, తరవాత ఆదరగొట్టే ఆట, ఆపైక్యాన్సర్‌పై గెలుపు, ఇప్పుడు చిన్నారులకు చదువుల సాయం... యువీ బయోపిక్‌ తీయడానికి ఇంతకుమించిన అంశాలు కావాలా... ఇప్పటికే నిర్మాతలు, దర్శకుల కన్ను పడే ఉంటుంది!!

  English summary
  Abhishek expressed admiration for the cricketer’s resilience. “The way Yuvraj has battled all odds in life and the way he has played the World cup, knowing he had cancer deserves a salute. The way he fought cancer too is an extremely inspiring story and I have learnt a lot from him,” he said. the actor said. “I love the career graph of Yuvi. It’s fantastic. Let’s see what are the opinions of abhishek bachchan About Yuvraj Singh.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more