»   » నువ్వే పందివి..! చిన్ని కృష్ణ అలా అనేసాడు ఎవర్నో కాదు...

నువ్వే పందివి..! చిన్ని కృష్ణ అలా అనేసాడు ఎవర్నో కాదు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక ఉధ్యమం మొదలు కావాలంటే దాని వెనుక ఎంతటి వేదనా, ఎంత ఆగ్రహం.., కడుపు మంటా ఉంటాయో ఆ జనం మధ్యనుంచే వచ్చిన నాయకులకి అర్థం కాకుంటే ఇంకెవరికి అర్థమౌతుంది? కానీ ఇక్కడ కేంద్రమంత్రి వర్యులు సుజనా చౌదరి మాత్రం అనుకోకుండా జరిగిందో లేక కావలనే అన్నారో గానీ అంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా పై జనం ఆవేశాన్ని తేలిగ్గా తీసిపడేసారు.

ప్రత్యేక హోదా అయిపోయిన అంశం అనేసారు కేంద్రమంత్రి సుజనా చౌదరి. పవన్ కల్యాణ్‌తో సహా ఎవరైనా సరే పలాన విధంగా నష్టం జరిగిందని స్పష్టంగా చెబితే స్పందిస్తాననీ, జల్లికట్టు స్పూర్తి కావాలనుకుంటే వెళ్లి జల్లికట్టే ఆడుకోవాలని ఎద్దేవా చేస్తూ. లేకపోతే కోళ్ల పందాలు, పందుల పందాలు ఆడుకోవాలని సూచించారు.

Writer Chinni krishna Counter To Sujana Chawdary

అంతే ఒక్కసారిగా ఆయన మీద విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, సుజనా చౌదరి 'పందుల పందాల'కు 'ఆంధ్రప్రదేశ్‌ యువత' గట్టిగానే కౌంటర్‌ ఇస్తోంది. ప్రత్యేక హోదా నంది అయితే, ప్రత్యేక ప్యాకేజీ పంది.. అంటూ సరికొత్త పోస్టింగులతో సోషల్‌ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ యువత తెగేసి చెబుతోంది.

జనసేన అధ్యక్షుడు సినీ హీరో పవన్ కళ్యాణ్ "యువత పోరాట స్పూర్తిని "సుజనా చౌదరి గారు" పందులు పందాలు తో పోల్చడం ' చాల భాదాకరం.." అంటూ ట్వీట్ చేసారు. ఇక ఆ పోస్ట్ కింద వస్తున్న కామెంట్లు మాత్రం అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఉన్నాయి.ఇక సినీ రచయిత చిన్ని కృష్ణ అయితే మరో అడుగు ముందుకు వేసి డైరెక్ట్ గా సుజనా చౌదరినే "పంది" అనేసారట. "హోదాను అడ్డుకోవాలని చూస్తున్న సుజనా చౌదరే పంది" అని సంచలన వ్యాఖ్యలు చేశాడన్న వార్తలు వస్తున్నాయి.

Writer Chinni krishna Counter To Sujana Chawdary

ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న సుజనా చౌదరే పంది అని, అలాంటి పందివైన నీతోనే ఆట స్టార్‌ చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌లను విమర్శిస్తే ఊరుకోబోమనీ విద్యార్థులను అరెస్టు చేస్తే హోదా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చిన్ని కృష్ణ హెచ్చరించారట. మొత్తానికి టాలీవుడ్ ప్రముఖులంతా జనం లోకి రావటం మాత్రమే కాదు స్వయంగా ఉధ్యమం లో పాల్గొనే దాకా వెళ్తున్నారు.

English summary
Pawan Kalyan and cine writer chinni krishna counters Sujana Chowdary Sujana's comments over AP Special Package
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu