»   »  ఎన్టీఆర్ అరుదైన వజ్రం.. సరిగా వాడుకో..

ఎన్టీఆర్ అరుదైన వజ్రం.. సరిగా వాడుకో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కొత్త చిత్రం ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ తన స్పందనను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకొన్నారు. ఈ సందర్భంగా మాటల రచయిత కోన వెంకట్ తగు సూచలిచ్చారు.

 నీ చేతిలో అరుదైన వజ్రం ఉంది

నీ చేతిలో అరుదైన వజ్రం ఉంది


‘నీ చేతిలో ఎన్టీఆర్ అనే ఓ అరుదైన వజ్రం ఉంది. దానిని సరిగా ఉపయోగించుకో. నీవు ఎన్టీఆర్‌ను అద్భుతంగా చూపిస్తావనే నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్' అని మాటల రచయిత, నిర్మాత, దర్శకుడు కోన వెంకట్ ట్వీట్టర్‌లో దర్శకుడు బాబీ అభినందనలు తెలిపారు.

 దేవీశ్రీ ప్రసాద్ యూ ఆర్ రాక్స్..

దేవీశ్రీ ప్రసాద్ యూ ఆర్ రాక్స్..


‘రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ అద్భుతంగా జరిగాయి. అద్భుతమైన ట్యూన్లను ఇచ్చినందుకు థ్యాంక్స్. ప్రేక్షకులను నీ పాటలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి' అని దర్శకుడు బాబీ అన్నారు. ఎన్టీఆర్, దేవీశ్రీ ప్రసాద్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

 యంగ్ టైగర్ మంచి హృదయమున్న వ్యక్తి

యంగ్ టైగర్ మంచి హృదయమున్న వ్యక్తి


‘మంచి హృదయం ఉన్న వ్యక్తుల్లో యంగ్ టైగర్ తారక్ ఒకరు. ఆయనతో ఉంటే ఉత్సాహంగా ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఆయన చాలా ప్రేమగా చూసుకొంటారు' అని ఎన్టీఆర్ పై బాబీ ప్రశంసల వర్షం కురిపించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌ను సరికొత్త రూపాల్లో ఆవిష్కరించేందుకు దర్శకుడు బాబీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

 కల్యాణ్ రామ్‌కు రుణపడి ఉంటాను

కల్యాణ్ రామ్‌కు రుణపడి ఉంటాను


‘అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని కల్పించిన నందమూరి కల్యాణ్ రామ్‌కు రుణపడి ఉంటాను. నన్ను నమ్మి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను అప్పగించారు. మంచి టెక్నిషియన్లను, గొప్ప టీమ్‌ను ఇచ్చారు' అని బాబీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

English summary
NTR's 27th movie is opening on friday. In this occassion writer Kona Venkat gives valuable suggestion to director Bobby.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu