»   » చిరు 150: అందని ఆహ్వానం, తనకే క్రెడిట్ ఇవ్వాలంటున్న రైటర్

చిరు 150: అందని ఆహ్వానం, తనకే క్రెడిట్ ఇవ్వాలంటున్న రైటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా నిన్న గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రీమేక్ గా వివి వినాయక్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా స్టోరీపై కొన్ని రోజులుగా వివాదం ఉన్న సంగతి తెలిసిందు.

తమిళ 'కత్తి' చిత్రం స్టోరీ తనదే అంటే ఎం.నరసింహారావు అనే రచయిత చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. ఇపుడు అదే కథను తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తుండంతో వివాదం మరింత హైప్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరగనిచ్చేది లేదంటూ గతంలో ఆయన ఆందోళన కూడా చేసాడు.

అయితే అతనితో దర్శకుడు వివి వినాయక్ సెటిల్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. కొంత రెమ్యూనరేషన్ అప్పజెప్పి ఆయన్ను కూల్ చేసినట్లు సమాచారం. అయితే నిన్న జరిగిన 150వ సినిమా ప్రారంభోత్సవానకి నరసింహరావును ఆహ్వానించలేదు. దీంతో తనకు క్రెడిట్ ఇవ్వరేమో అని ఆందోళన చెందుతున్నారు.

Writer not to allow Chiru's 150th film shoot

ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా పోస్టర్స్, టైటిల్స్ లో తనకూ క్రెడిట్ ఇవ్వాలని, రచయితగా తన పేరు వేయాలని కోరుతున్నారు. ఈ విషయమై దర్శకుడు వినాయక్ నుండి సరైన భరోసా రాక పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు క్రెడిట్ ఇవ్వక పోతే మళ్లీ ఆందోళన చేస్తానని చెప్పకనే చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

150వ సినిమా ప్రారంభోత్సవం విషయానికొస్తే...
ఏప్రిల్ 29 మధ్యాహ్నం గం.1.30ని.లకు పూజా కార్యక్రమాలతో చిరంజీవి 150వ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. చిరంజీవి కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తుండటం మరో విశేషం. ఇందుకోసం రామ్ చరణ్ 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' అనే సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు.

గతంలో చిరంజీవికి ఠాగూర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం శుభ ముహూర్తాన సినిమా ప్రారంభం కాగా...ముహూర్తపు సన్నివేశానికి పరచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్విచ్ ఆన్ చేసారు.

సౌత్ లో టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిరంజీవిని తన కెమెరా ద్వారా మరింత స్టైలిష్ గా చూపించబోతున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించనున్నారు. చిరంజీవి గత చిత్రాలు శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు దేవిశ్రీ విజయవంతమైన సంగీతం అందించారు.

English summary
Film writer M Narasimha Rao has said he would not allow the regular shooting of Chiranjeevi's 150th film take place if he is not assured that he would be credited with the story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X