»   » రెస్పెక్టెడ్ పవన్‌ ఫాన్స్‌...! ఆ బల్లాల దేవుడు బన్నీ కాదు

రెస్పెక్టెడ్ పవన్‌ ఫాన్స్‌...! ఆ బల్లాల దేవుడు బన్నీ కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అభిమానం అంటే ఒకరిమీద ఇష్టం కన్నా ఒక మెట్టు ఎక్కువగా ఉండే భావోద్వేగం కానీ అది మన టాలీవుడ్ లో మరో అడుగు ముందుకు వేస్తుంది. నిజమైన ఫ్యాన్స్ లో ఒకరో ఇద్దరో చేసే పనులకు మొత్తం అభిమానులంతా ఆనిందలని మోయాల్సి వస్తుంది. ఇప్పుడూ బహుబలి ప్రమోషన్స్ లో విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాట ఇప్పుడు మళ్ళీ ఒక సారి బన్నీ, పవన్ అభిమానుల మధ్య రచ్చకు దారి తీసింది.... ఒకరి మీద ఒకరు సెటైర్లతో మళ్ళీ రెచ్చిపోవటం మొదలు పెట్టారు...

పవన్‌ స్ఫూర్తిగానే

పవన్‌ స్ఫూర్తిగానే

బాహుబలి పాత్రకి జనం జేజేలు పలుకుతోంటే, భల్లాలదేవుడు అసూయ పడే సన్నివేశాన్ని పవన్‌ స్ఫూర్తిగానే రాసుకున్నానని విజయేంద్రప్రసాద్‌ చెప్పారు.అంతే ఎవరు ఏమిటి ఊహించుకున్నారో తెలీదు గానీ ఒక్కసారిగా ట్రోలర్లు రెచ్చిపోయారు. ఆ బల్లాల దేవుడ్ బన్నీ నే అంటూ కొత్త వాదన మొదలు పెట్తారు. నిజానికి విజయేంద్ర ప్రసాద్ గారు అలా చెప్పను కూడా లేదు...

చెప్పను బ్రదర్‌

చెప్పను బ్రదర్‌

'చెప్పను బ్రదర్‌' అంటూ పవన్‌ అభిమానుల సందడిని వ్యతిరేకించిన అల్లు అర్జున్‌ని గురించే ఆ సీన్‌ అలా రాసారని, అంతగా పవన్‌ క్రేజ్‌ చూసి కుళ్లుకున్న హీరో ఇంకెవరు వున్నారని పవన్‌ ఫాన్స్‌ బన్నీని టీజ్‌ చేస్తున్నారు. భల్లాలదేవుడి గెటప్‌లో బన్నీని చూపిస్తూ మీమ్‌లు తయారు చేసి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. ఇదికాస్తా మరింత వేడెక్కించేలా మారటం తో విజయేంద్ర ప్రసాద్ లైన్లోకి వచ్చారు...

బాహుబలి ఆడియో వేడుక లో

బాహుబలి ఆడియో వేడుక లో

ఆ సన్నివేశానికి వేరే ఏదో ఆడియో ఫంక్షన్‌లో జరిగిన సంఘటన స్ఫూర్తి కాదని, బాహుబలి ఆడియో వేడుక తిరుపతిలో చేసినపుడు అడివి శేష్ 'పంజా' గురించి మాట్లాడుతూ పవన్‌ ప్రస్తావన తెచ్చినపుడు అక్కడ సభాప్రాంగణం హోరెత్తిపోయిందని, అసలు ఒక వ్యక్తిపై ఇంత అభిమానమేంటని అనిపించిందని, తర్వాత ఒకట్రెండు ఆడియో వేడుకల్లోను అది కనిపించినపుడు, ఇదే లైన్స్‌లో బాహుబలి ఇంటర్వెల్‌ సీన్‌ రాస్తే ఎలా వుంటుందనిపించి, ఇప్పుడున్న సీన్‌ రాసుకున్నానని ఆయన వివరణ ఇచ్చారు.

 ఫిక్స్‌ అయిపోయారు.

ఫిక్స్‌ అయిపోయారు.

అయితే మేం ఫిక్సయ్యాక ఎవ్వరి మాటా వినం అన్నట్టు సాక్షాత్తూ రచయితే చెప్పినా కూడా ఈ ట్రోలింగ్ ఆగటం లేదు. సోషల్ మీడియాలో మీం లూ, పోస్ట్ లూ పడుతూనే ఉన్నాయి... గతం లో జరిగిన సంఘటనలతో బన్నీ పై విరక్తి పెంచుకున్న పవన్ ఫ్యాన్స్ వున్న వైరం కారణంగా భల్లాలదేవుడు అతడేనంటూ ఫిక్స్‌ అయిపోయారు.

English summary
The veteran writer Vijayendra Prasad Clarity Over Baahubali Interval Scene, and says Bunny is not Ballala deva
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu