»   » తెలుగులోనూ అదరగొట్టింది: దీపిక పదుకోణే ట్రిపులెక్స్ ట్రైలర్

తెలుగులోనూ అదరగొట్టింది: దీపిక పదుకోణే ట్రిపులెక్స్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హాలీవుడ్ సినిమాలో నటిస్తోందనగానే బోలెడంత క్యూరియాసిటీ నెలకొంది. అది కూడా హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ కి జోడీగా యాక్షన్ థ్రిల్లర్ ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో హీరోయిన్ ఛాన్స్ లభించడం.. దీపికా రేంజ్ ను పెంచేసింది. ఇదే స్థాయిలో ఆ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయితే.. కొన్ని వారాల క్రితం విడుదలైన ట్రిపుల్ ఎక్స్ క్సాండర్ కేజ్ ట్రైలర్ చాలామందిని.. ముఖ్యంగా దీపిక అభిమానులను.. ఇండియన్ మూవీ లవర్స్ ను డిజప్పాయింట్ చేసింది. దీనికి కారణం.. దీపిక కేవలం ఆరు ఫ్రేమ్స్ లో మాత్రమే కనిపించడమే.

xXx: Return of Xander Cage trailer out in four languages

ఇప్పడీ మూవీ రెండో ట్రైలర్ వచ్చేసింది. ప్రత్యేకంగా హిందీ వెర్షన్ కోసం డిజైన్ చేశారనే విషయం తెలుస్తూనే ఉంది కానీ.. హిందీ-ఇంగ్లీష్ రెండు వెర్షన్స్లతో పాటు తెలుగు తమిళం లో కూడా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. అసలు దీపికానే లీడ్ రోల్ చేసేస్తోందా ఏంటి అనిపించే రేంజ్ లో ఈ ట్రిపుల్ గ్జాండర్ కేజ్ రెండో ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ దీపికా యాక్షన్ సీన్స్ చూస్తుంటే పిచ్చెక్కి పోవాల్సిందే. ఇది కదా మా ఇండియన్ బ్యూటీ హాలీవుడ్ లో చూపించాల్సిన విషయం అని ఫ్యాన్స్ మత్తెక్కి పోతున్నారు.

ట్రైలర్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉండగా, సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో కొన్ని హాలీవుడ్ మూవీస్ తెలుగులో డబ్ అయి రిలీజ్ అవుతున్న నేపధ్యంలో దీపిక నటిస్తోన్న హాలీవుడ్ మూవీ ట్రైలర్‌ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు వర్షెన్ ట్రైలర్ సైతం అందరిని అలరిస్తోంది. డీజే కరుసో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2017 , జనవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా టోనీజా, శామ్యూల్ జాక్సన్, టోని కొలెట్, నినా డొబ్రెవ్, రూబీ రోజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

హాలీవుడ్ భామలకు ఏ విషయంలోనూ ఏ యాంగిల్ లోనూ తగ్గకుండా దీపిక చూపించిన ట్యాలెంట్ అదరహో అనాల్సిందే. నెక్ట్స్ జనవరికి ఈ ట్రిపుల్ ఎక్స్ సిరీస్ రిలీజ్ అయ్యాక.. దీపిక రేంజ్ ఏ రేంజ్ లో ఊహించుకోవడానికి.. ఈ ట్రైలర్ జస్ట్ ఓ ఎగ్జాంపుల్ అంతే. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హాలీవుడ్ సినిమాలో నటిస్తోందనగానే బోలెడంత క్యూరియాసిటీ నెలకొంది. అది కూడా హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ కి జోడీగా యాక్షన్ థ్రిల్లర్ ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో హీరోయిన్ ఛాన్స్ లభించడం.. దీపికా రేంజ్ ను పెంచేసింది. ఇదే స్థాయిలో ఆ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయితే.. కొన్ని వారాల క్రితం విడుదలైన ట్రిపుల్ ఎక్స్ క్సాండర్ కేజ్ ట్రైలర్ చాలామందిని.. ముఖ్యంగా దీపిక అభిమానులను.. ఇండియన్ మూవీ లవర్స్ ను డిజప్పాయింట్ చేసింది. దీనికి కారణం.. దీపిక కేవలం ఆరు ఫ్రేమ్స్ లో మాత్రమే కనిపించడమే.

English summary
Deepika Padukone’s xXx: Return of Xander Cage trailer out in four languages for Indian fans
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu