»   » చిరు ‘యముడికి మొగుడు’ 25 (స్పెషల్ ఫోకస్)

చిరు ‘యముడికి మొగుడు’ 25 (స్పెషల్ ఫోకస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి హీరోగా అప్పట్లో వచ్చిన 'యముడికి మొగుడు' చిత్రం ఏ రేంజిలో హిట్టయింతో కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్లీ చూడాలనిపిస్తుంది. ఇప్పటికీ టీవీల్లో ఆ సినిమా వస్తుందంటే ఆసక్తిగా చూసే వారు ఎంతో మంది. పూర్తి వినోదాత్మకంగా ఉండటమే ఈ చిత్రం ప్రత్యేకత. ఏప్రిల్ 29, 1988లో విడుదలైన ఆ సినిమా వచ్చి నేటికి పాతికేళ్లయింది.

చిరంజీవి, రాధ, విజయశాంతి, కైకాల సత్యనారాయణ, రావుగోపాల్ రావు, అల్లు రామలింగయ్య, సుత్తివేలు, సుధాకర్, గొల్లపూడి తారాగణంగా రూపొందిన ఈచిత్రానికి రవిరాజా పనిశెట్టి దర్శకత్వం వహించారు. సుధాకర్, నారాయణరావు, హరి ప్రసాద్ సంయుక్తంగా 'డైనమిక్ మూవీమేకర్స్' అనే సంస్థను నెలకొల్పి ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లోనే ఈచిత్రానికి కోటి పాతికలక్షలు ఖర్చయింది.

చిరంజీవి సినిమా అవకాశాల కోసం చెన్నైలో తిరుగుతున్న రోజుల నుంచి సుధాకర్, నారాయణరావు, హరి ప్రసాద్ లతో స్నేహం ఉంది. ఈ స్నేహం కారణంగానే చిరంజీవి వారికి సినిమా తీసే అవకాశం ఇచ్చారు. సినిమా తీద్దామని అంతా డిసైడ్ అయ్యాక కథకోసం అన్వేషణ ప్రారంభించారు.

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అనే అంశానికి యముడి నేపథ్యాన్ని జోడించి సత్యానంద్ కథ తయారు చేసారు. కథ, స్క్రిప్టు అద్భుతంగా కుదింది. కాళీ, బాలుగా ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసారు. కొందరి కుట్ర కారణంగా బలైపోయిన కాళి యమలోకానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లాక తన ఆయువు తీరలేదని తెలుసుకుని యమున్ని ముప్పతిప్పలు పెడతాడు. కాళి గోల భరించలేక అతని ఆత్మను బాలు శరీరంలోకి పంపిస్తారు. అమాయకుడైన బాలు శరీరంలో చేరిన కాళీ విలన్స్ పని పడతాడు. ఇలా పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది.

ఇక ఈ సినిమాకు రాజ్-కోటి అందించిన సంగీతం హైలెట్ అయింది. ఈచిత్రంలో పాటలన్నీ హిట్ కావడానికి తోడు, చిరంజీవి బ్రేక్ డాన్స్ స్టెప్పులు సినిమా ఓ రేంజికి వెళ్లింది. దీంతో అప్పటి వరకు వచ్చిన చిరంజీవి సినిమాలన్నింటికంటే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది 'యముడికి మొగుడు'. అప్పటి వరకు విలన్ పాత్రలకే పరిమితం అయిన సుధాకర్ ఈ చిత్రంతో కెమెడీయన్ గా పాపులర్ అయ్యాడు. రాజ్-కోటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు.

English summary
Megastar chiranjeevi's 'Yamudiki Mogudu' was released on 29th April, 1988 and completed 25 years on the same day this year. This movie stood as one of the remarkable movies in the career of chiranjeevi.
Please Wait while comments are loading...