»   » డైరెక్ట్ గా చిరంజీవితోనే చెప్పగలను: నాగబాబుకు యండమూరి సమాధానం ఇలా

డైరెక్ట్ గా చిరంజీవితోనే చెప్పగలను: నాగబాబుకు యండమూరి సమాధానం ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగబాబు తనపై చేసిన కామెంట్లపై ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ స్పందించారు. ఓ వైపు ఎంతో సందడిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాగుతుంటే.... మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరు వ్యక్తులపై నిప్పులు చెరుగుతూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది.నాగబాబు మాట్లాడుతూ.... వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పుకునే ఒకడు చరణ్ బాబు గురించి తప్పుగా మాట్లాడిన విషయం, తక్కువ చేసిన మాట్లాడిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

ఆయన ఒక రచనా వ్యాసంగ నిపుణుడు. కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను. అయితే అతనొక మూర్ఖుడు. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే వాడికి అసలువ్యక్తిత్వం లేదు, వాడో కుసంస్కారి....అలాంటి వాడు చేసే కామెంట్స్ తమకు ఎలాంటి నష్టాన్ని కలిగించవు, వాడెవడో నేను చెప్పను, నా మాటలు వాడికి అర్థమవుతాయి అని ఫైర్ అయ్యారు. అయితే నాగ బాబు అన్నది ప్రముఖ రచయిత యండమూరినే అన్న విషయం ఆయనకే కాదు ప్రతీ ఒక్కరికీ అర్థమైపోయింది....

 తప్పుగా మాట్లాడలేదు:

తప్పుగా మాట్లాడలేదు:

అయితే ఈ విమర్ష పై స్పందించిన యండమూరి, నాగ బాబుకు సమాధానం ఇస్తూ..... తాను ఆరేడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నాగబాబు సరైన వేదికను ఎంచుకోలేదన్నారు. చరణ్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. చరణ్ తండ్రి చిరంజీవి, దేవీశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఇద్దరూ తనకు స్నేహితులని యండమూరి గుర్తు చేశారు.

 నాగబాబు తనకు మంచి మిత్రుడు:

నాగబాబు తనకు మంచి మిత్రుడు:


తండ్రి ఎవరనేది ముఖ్యం కాదని, నువ్వేంటనేదే ముఖ్యమనే విషయాన్ని చెబుతూ తాను మాట్లాడానని యండమూరి గుర్తు చేశారు. తాను విమర్శించాలనుకుంటే నేరుగా చిరంజీవితోటే చేస్తానన్నారు. నాగబాబు తనకు మంచి మిత్రుడని చెప్పిన యండమూరి ఆ తర్వాత కూడా తాను, నాగబాబు అనేకసార్లు కలుసుకున్నట్లు చెప్పారు.

 తప్పుడుగా సమాచారం :

తప్పుడుగా సమాచారం :


తనకు వ్యతిరేకంగా నాగబాబుకు ఎవరో తప్పుడుగా సమాచారం ఇచ్చి ఉంటారని యండమూరి అనుమానం వ్యక్తం చేశారు. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలలు ఎన్నో చిరంజీవితో సినిమాలుగా తీసారు. ఆ సినిమాలు అన్ని ఆ రోజులలో సూపర్ హిట్స్ గా నిలిచాయి.

 షాకింగ్ న్యూస్:

షాకింగ్ న్యూస్:


దీనితో యండమూరి చిరంజీవిల మధ్య చాలా మంచి సాన్నిహిత్యం కూడ ఏర్పడింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని యండమూరి చిరంజీవి నటవారసుడు రామ్ చరణ్ ను కామెంట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధులను ఉద్దేశించి మాట్లుడుతూ యండమూరి ఈ వ్యాఖ్యలు చేశాడు.

 గడ్డం దగ్గర సర్జరీ :

గడ్డం దగ్గర సర్జరీ :


చిరంజీవితో తాను సినిమాలు చేస్తున్న రోజుల్లో చరణ్ వాళ్లమ్మ తన కొడుకును హీరో చేయాలని ఎంతో కష్టపడేది అని అంటూ డ్యాన్సులూ ఫైట్స్ చాల కష్టపడి నేర్పించింది అంటూ చరణ్ చిన్నతనంలో పెద్దగా అందంగా కనిపించక పోవడంతో గడ్డం దగ్గర సర్జరీ జరిగిన విషయాన్ని బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు యండమూరి.

 సరస్వతీ ప్రసాద్:

సరస్వతీ ప్రసాద్:


ఇదే సందర్భంలో రచయిత సత్యమూర్తి కొడుకు సరస్వతీ ప్రసాద్ (దేవిశ్రీ ప్రసాద్) తన తండ్రిలా రచయితలా కాకుండా చిన్నతనం నుండి సంగీతం పై విపరీతమైన మక్కువ చూపించే వాడు అని చెప్పాడు యండమూరి. ఒకసారి చిరంజీవి నటించిన సినిమాలోని ఇళయరాజా కంపోజ్ చేసిన ‘అబ్బనీ తీయనీ దెబ్బ' ట్యూన్ విని

 దేవిశ్రీ ప్రసాద్:

దేవిశ్రీ ప్రసాద్:


ఇది శివరంజనీ రాగం అంటూ 8 ఏళ్ల వయస్సులో దేవిశ్రీ ప్రసాద్ గుర్తించినప్పుడు తాను ఎంతో ఆశ్చర్య పోయి ఈ అబ్బాయి ఎదో ఒక రోజున సినిమా రంగాన్ని శాసిస్తాడు అని అనుకున్నానని అతడే డి ఎస్ పి గా మారి కోట్లాది మంది అభిమానులను పొందాడు అని కామెంట్ చేసాడు.

 హోరెత్తించారు:

హోరెత్తించారు:


ఈమాటలు యండమూరి నోటి వెంట రాగానే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులు అంతా చప్పట్లతో హోరెత్తించారు. ఇది చూసి వెంటనే యండమూరి మాట్లాడుతూ మరో పంచ్ చరణ్ పై వేసాడు. ‘చరణ్ పేరు చెప్పినప్పుడు మీరు చప్పట్లు కొట్టలేదు, కాని దేవిశ్రీ ప్రసాద్ పేరు చెబితే వెంటనే చప్పట్లు కొట్టారు,

 మీ నాన్న ఎవరు అన్నది కాదు:

మీ నాన్న ఎవరు అన్నది కాదు:


అంటే నువ్వు ఏంటి అన్నది ముఖ్యం, మీ నాన్న ఎవరు అన్నది కాదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు యండమూరి. ఈమాటలు యండమూరి నోటి వెంట విన్నవారు మాత్రం చరణ్ ఇంకా తండ్రి చాటు బిడ్డగానే కొనసాగుతున్నాడు అనే అర్ధం వచ్చేలా యండమూరి ఈ సెటైర్ వేసి ఉంటాడని కామెంట్ చేసుకున్నారు. అయితే ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ విష్స్యాన్ని ఎత్తి మాట్లాడతం తో ఆ దుమారం మళ్ళీ రేగింది...

English summary
Writer Yendamuri Veerndranath reacted on Naga Babu comments about him at Chiranjeevi Khaidi No 150 Prerelease event
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu