»   » షాక్: రామ్ చరణ్ మీద యండమూరి వివాదాస్పద కామెంట్!

షాక్: రామ్ చరణ్ మీద యండమూరి వివాదాస్పద కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ సినిమాల్లోకి రాక ముందు ఒకలా.... సినిమాల్లోకి వచ్చిన తర్వాత మరొకలా ఉండటం చూసి చాలా మంది రామ్ చరణ్ ఫేసుకు సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. తాజాగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వ్యాఖ్యలతో రామ్ చరణ్ కు సర్జరీ జరిగిన విషయం నిజమే అని తేలిపోయింది.

ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఫంక్షన్ కు హాజరైన యండమూరి మాట్లాడుతూ.....చిరంజీవితో అభిలాష సినిమా చేసిన రోజులను గుర్తు చేసుకుంటూ రామ్ చరణ్ ప్రస్తావన తెచ్చారు. రామ్ చరణ్ ను హీరో చేసేందుకు అతని తల్లి సురేఖ చాలా కష్టపడేది. అప్పట్లో ఆ అబ్బాయికి దవడ సరిగా ఉండేది కాదు. తరువాత దాన్ని సరిచేయించారు' అని వ్యాఖ్యానించారు.

yandamuri Veerendranath sensation comments on Ram Charan

అదే విధంగా దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తావన కూడా తెచ్చారు యండమూరి... ఆ రోజుల్లో ఎనిమిదేళ్ల కుర్రాడు సంగీతంలో ఎంతో ప్రతిభ చూపించేవాడు. ఇళయరాజా స్వరపరిచిన అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట విని శివరంజని రాగం అని గుర్తు పట్టారు. దీంతో ఆ అబ్బాయిని ఇళయరాజా మెచ్చుకున్నారు. అతడే దేవిశ్రీ ప్రసాద్ అని తెలిపారు.

అయితే ఆయన మరో వివాదాస్పద కామెంట్ చేయడం మెగా అభిమానులకు కోపం తెప్పించింది... రామ్ చరణ్ గురించి నేను మాట్లాడినపుడు మీరు చప్పట్లు కొట్టలేదు, దేవిశ్రీ గురించి గురించి మాట్లాడినపుడు చప్పట్లు కొట్టారు. ఎందుకంటే దేవిశ్రీ స్వశక్తితో పైకి వచ్చాడు. నువ్వు ఏమిటన్నది ముఖ్యం, మీ నాన్న ఎవన్నది ముఖ్యం కాదు... అంటూ యండమూరి వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.

English summary
Yandamuri Veerendranath sensation comments on Ram Charan. His comments turns Controversy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu