»   » చైతు, సమంత ముద్దుల వర్షం..పెళ్లి తరువాత ఏం జరిగింది..ఫాన్స్ కి పండగే!

చైతు, సమంత ముద్దుల వర్షం..పెళ్లి తరువాత ఏం జరిగింది..ఫాన్స్ కి పండగే!

Subscribe to Filmibeat Telugu
పెళ్లి తరువాత ఏం జరుగుతుంది?

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రేమ జంటలలో నాగ చైతన్య, సమంత మొదటి వరుసలో ఉంటారు. ఏం మాయ చేసావే చిత్రంతో ప్రొఫెషనల్ గా కలసిన ఏ జంట గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏళ్ల తరబడి సాగిన వీరి ప్రేమ కథ విజయవంతం అయింది. వీరి ప్రేమకు బీజం పడింది మాత్రం ఏ మాయ చేసావే చిత్రంతోనే. ఆ చిత్రంలో సమంత, చైతు మధ్య కెమిస్ట్రీ యువతని ఉర్రూతలూగించింది. ఏకంగా ముద్దు సన్నివేశలతో సంచనలం సృటించారు. మరో మారు ప్రేక్షకుల ఆ అనుభూతిని కలిగించడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ మాయ చేసావే చిత్రానికి సీక్వెల్ సిద్ధం అవుతోందంటూ వస్తున్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఏ మాయ చేసావేతో కలయిక

ఏ మాయ చేసావేతో కలయిక

సమంత, నాగ చైతన్య జంట ఏ మాయ చేసావే చిత్రంతో కలుసుకున్నారు. ఈ చిత్రం సమంతకు డెబ్యూ మూవీ. నాగచైతన్యకు రెండవ చిత్రం. చైతూకు తొలి సక్సెస్ దక్కింది మాత్రం ఈ చిత్రంతోనే.

కెమిస్ట్రీకి యువత ఫిదా

కెమిస్ట్రీకి యువత ఫిదా

ఏ మాయ చేసావే చిత్రంలో చైతు, సమంత మద్య రొమాంటిక్ సన్నివేశాలకు యువత ఫిదా అయిపోయారు. ఆ చిత్రంలో ఈ జంట కెమిస్ట్రీ అదిరిపోయిందనే కాంప్లిమెంట్స్ వినిపించాయి.

మరో మారు మ్యాజిక్

మరో మారు మ్యాజిక్

సమంత, చైతు మ్యాజిక్ మనం చిత్రంలో కూడా బాగా పనిచేసింది. మనం చిత్రంలో చైతు సమంత జంటగా నటించారు. ఆటోనగర్ సూర్య చిత్రంలో కూడా సమంత, చైతు మెరిశారు. కానీ మనం చిత్రం మాత్రం ఓ క్లాసికల్ హిట్ గా నిలిచింది.

రాణిస్తున్న చైతు

రాణిస్తున్న చైతు

నాగ చైతన్య హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి అవకాశాలతో రాణిస్తున్నాడు.

తిరుగులేని సమంత

తిరుగులేని సమంత

సమంత సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్యూట్ హీరోయిన్ ఆన్ స్క్రీన్ పై చేసే మాయ అంతా ఇంతా కాదు. కేవలం సమంత పెర్ఫామెన్స్ తో గట్టెక్కిన చిత్రాలు ఉన్నాయి.

మొగ్గలు తొడిగిన ప్రేమ

మొగ్గలు తొడిగిన ప్రేమ

వరుస చిత్రాలతో బాగా దగ్గరైన చైసామ్ జంట మధ్య ప్రేమ చిగురించింది. టాలీవుడ్ లో చైసామ్ లవ్ స్టోరీ ఓ హాట్ టాపిక్.

ప్రేమకు గ్రీన్ సిగ్నల్, రియల్ లైఫ్ స్టార్ట్

ప్రేమకు గ్రీన్ సిగ్నల్, రియల్ లైఫ్ స్టార్ట్


చై సామ్ ప్రేమకు పెద్దల అంగీకారం దొరకడంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భార్య, భర్తలుగా సమంత, చైతు రియల్ లైఫ్ ని మొదలు పెట్టారు.

పెళ్లి తరువాత కూడా

పెళ్లి తరువాత కూడా

చైతు హీరోగా రాణిస్తున్నాడు. సమంత పెళ్లి తరువాత కూడా ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉంది. ఇప్పటికి సమంత క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తోంది.

ఒక్కటి చేసిన సినిమాకు పొడిగింపు

ఒక్కటి చేసిన సినిమాకు పొడిగింపు

సమంత, చైతుని ఒక్కటి చేసిన చిత్రం ఏ మాయ చేసావే. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ రొమాంటిక్ లవ్ స్టోరీకి సీక్వెల్ సిద్ధం అవుతోందంటూ వస్తున్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

పెళ్లి తరువాత ఏం జరుగుతుంది

పెళ్లి తరువాత ఏం జరుగుతుంది

దర్శకుడు గౌతమ్ మీనన్ ఏ మాయ చేసావే చిత్రానికి సీక్వెల్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. పెళ్లి తరువాత ఆ జంట జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అనే అంశాన్ని గౌతమ్ మీనన్ చూపించేందుకు సిద్ధం అవుతున్నారట.

ముద్దుల వర్షం

ముద్దుల వర్షం

ఏ మాయ చేసావే చిత్రంలో కథతో పాటు యువతని ఆకర్షించిన మరో అంశం చై సామ్ మధ్య రొమాంటిక్ సీన్స్. ఆ చిత్రంలో వీరిద్దరూ ముద్దు సన్నివేశాల్లో నటించారు. ఒక వేళ సీక్వెల్ రెడీ అయితే గౌతమ్ మీనన్ ఇందులో వీరి రొమాన్స్ ని ఎలా చూపిస్తారని విషయం గురించి కూడా సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

English summary
Ye Maya Chesave sequel on cards. Gautham Menon preparing story for sequel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu