»   » కొన్ని తప్పులుచేశాను: చంద్రశేఖర్‌ ఏలేటి

కొన్ని తప్పులుచేశాను: చంద్రశేఖర్‌ ఏలేటి

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : 'ఒక్కడున్నాడు' తరవాత ఓ ప్రేమకథ చేద్దామనుకున్నా. నిర్మాతలను ఇబ్బందిపెట్టకుండా తక్కువ బడ్జెట్‌లో నేనే తీసేయాలనుకున్నాను. అదే 'ప్రయాణం'. మొదటిసారి నిర్మాతగా చేయడంవల్ల కొన్ని తప్పులుచేశాను. బడ్జెట్‌ ఎక్కువయిపోయింది. దాంతో కొన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. 'ప్రయాణం' నాకు మంచి గుర్తింపే తీసుకొచ్చినా డబ్బులు పెద్దగా రాలేదు. నేను ఆర్థికంగా చాలా కష్టపడిన సమయమది అంటూ చెప్పుకొచ్చారు చంద్రశేఖర్‌ ఏలేటి.

ఇక అప్పులు తీర్చడానికి మరో సినిమా చేయాలనుకున్నా. కథ కోసం ఏడాదిన్నర కష్టపడ్డాను. నిర్మాతకూ నాక్కూడా అది నచ్చలేదు. దాంతో దాన్ని పక్కనపెట్టేశాం. ఈలోగా అప్పులు మరింత పెరిగాయి. ఈసారి ఇంకో కథ రాసుకున్నా. అదే సమయంలో గోపీచంద్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ వచ్చి కథ అడిగారు. అలా మా కాంబినేషన్లో వచ్చిందే 'సాహసం'. నాకు గుర్తింపు తేవడమేకాదు... నా అప్పులన్నీ తీర్చిన సినిమా ఇది.

నామొదటి సినిమా 'ఐతే' 2003లో వచ్చింది. ఆ తరవాత వరుసగా రెండేసి ఏళ్ల వ్యవధిలో 'అనుకోకుండా ఒకరోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం' వచ్చాయి. ఆ తరవాత నాలుగేళ్లకుగానీ 'సాహసం' చేయలేకపోయాను. ఇదంతా నేను కావాలని చేసింది కాదు... అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. చాలామంది 'సినిమా కష్టాలు' అంటుంటారు. నిజంగా నావి సినిమా కష్టాలే. ఎందుకంటే సినిమాల్లోకి వచ్చే వరకూ నాకు పెద్దగా కష్టాల్లేవు.

అలాగే నేను చేసిన ప్రతీ సినిమా నాకో పాఠం నేర్పింది. నేను కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాను తప్ప... కష్టాలకు భయపడలేదు, భయపడను కూడా. ఇప్పటికే కొన్ని కథలున్నాయి. తరవాతి సినిమా ఎవరితో చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ప్రస్తుతం 'సాహసం' సంతోషంలో ఉన్నాను. ఉంటాను అన్నారు.

"నా కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ చిత్రం 'సాహసం'. అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అయింది. అయినా నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ ఎక్కడా వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. ఏడాదిన్నర తర్వాత నా సినిమా వచ్చినా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నా కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది సినిమా.
చంద్రశేఖర్ ఏలేటి ప్రతి క్షణం కథ గురించే ఆలోచించారు. నాకు హిట్ రావాలని అభిలషించిన వారందరికీ ధన్యవాదాలు'' అని అన్నారు.

English summary
After a long gap, actor Gopichand and director Chandrasekhar Yeleti are back to rock the big screen with their latest Telugu movie Sahasam, which has hit the marquee across the globe. It is neither a brainy nor an intelligent film, but a commercial entertainer. It is a typical Gopichand film with Yeleti's touch. You will really enjoy this technical extravaganza action thriller.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu