»   » కన్నడ శివరాజ్ కుమార్ తో యేలేటి చిత్రం

కన్నడ శివరాజ్ కుమార్ తో యేలేటి చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దర్శకుడు యేలేటి చంద్ర శేఖర్ రీసెంట్ గా ఓ మల్టి లింగ్వల్ ఫిల్మ్ ని మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయిన కన్నడ వెర్షన్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. తమిళ,తెలుగు, మళయాళ వెర్షన్స్ లకు గానూ మేహన్ లాల్, గౌతమీ నటిస్తూండగా, కన్నడ వెర్షన్ కు గానూ శివరాజ్ కుమార్ ని తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ మేరకు శివన్నతో చర్చలు జరిగినట్లు సమాచారం. శివన్నను కన్నడ వెర్షన్ కు తేవటం నిర్మాత సాయి కొర్రిపాటి ఆలోచన అని తెలుస్తోంది. శివన్న ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తో కిల్లర్ వీరప్పన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ఇప్పటికే చాలా క్రేజ్ వచ్చింది.

చిత్రం పూర్తి వివరాల్లోకి వెళితే..

Yeleti ropes in Shiva Rajkumar for Kannada version

జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్, విలక్షణ నటి గౌతమి ప్రధానపాత్రల్లో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఓ నూతన చిత్రం ప్రారంభంకానుంది. ‘ఐతే', ‘అనుకోకుండా ఒకరోజు', ‘ఒక్కడున్నాడు', ‘ప్రయాణం', ‘సాహసం' వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేయడమే కాకుండా తొలి చిత్రం ‘ఐతే'తో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

‘ఈగ', ‘అందాల రాక్షసి','లెజండ్', ‘ఊహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ‘ఈగ'తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి పనిచేస్తన్న ఈ చిత్రం నవంబర్ 3వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సాయి కొర్రపాటి తెలియజేశారు.

English summary
Director Chandrasekhar Yeleti who announced a multi-lingual film with Mohan Lal in the main role is now also planning a Kannada version with Shiva Rajkumar .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu