»   » జాగ్రత్తగా తీయకుంటే ‘ఎవడు’ పెద్ద ప్లాపవుతుందని హెచ్చరించాను : చిరంజీవి

జాగ్రత్తగా తీయకుంటే ‘ఎవడు’ పెద్ద ప్లాపవుతుందని హెచ్చరించాను : చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'ఎవడు' ఆడియో వేడుక సోమవారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు.

చిరంజీవి మాట్లాడుతూ...'అభిమానుల వ్యాల్యూ ఏమిటో, మీ మధ్య ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. అభిమానుల మధ్య ఉంటే ఎనలేని ఎనర్జీ. పొలిటికల్ లైఫ్ లో ఇవన్నీ మిస్సవుతున్నాను. పొలికల్ లైఫ్‌లో ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి ఫంక్షన్లకు రావడం వల్ల అదంతా మటుమాయం అవుతుంది. అసలు నేను ఈ ఫంక్షన్ కు రావాలని అనుకోలేదు. ఫ్యాన్స్ బలంగా చిరంజీవి ఇక్కడకు రావాలని కోరుకున్నారు కాబట్టే పరిస్థితులు అనుకూలించాయని నమ్ముతున్నాను.

ఈ సినిమా కథతో రెండేళ్ల క్రితం వంశీ నా దగ్గరకు వచ్చాడు. కథ విని ఏమీ మాట్లాడలేక పోయాను. అద్భుతంగా ఉంది. అయితే జాగ్రత్తగా తీయకుంటే పెద్ద ప్లాపయ్యే అవకాశం ఉందని హెచ్చరించాను, కానీ వంశీ హిట్ చేస్తానని నమ్మకంతో చెప్పారు. ఇలాంటి సినిమాకు దిల్ రాజు లాంటి వాళ్లు అయితేనే కరెక్ట్. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే.

అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు. అత్తారింటికి దారేది సినిమా షూటింగులో ఉండటం వల్లనే పవన్ రాలేక పోయాడు. ఎవడు జూబ్లీ పంక్షన్ పవన్ లేకుండా జరుగదని తప్పకుండా చెప్పగలను. దేవిశ్రీ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఇండస్ట్రీకి దొరికిన మంచి టాలెంట్ పర్సన్ దేవిశ్రీ. సాయికుమార్ ధర్మ పాత్ర చరణ్ హీరోయిజం పెంచేలా అద్భుతంగా ఉంది. శృతి హాసన్ మల్టీ టాలెంట్. చాలా బాగా నటించింది. సినిమాలో ప్రతి ఒక్కరూ చాలా బాగా చేసారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది' అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ....రెండు సంవత్సరాల క్రితమే కథ చెప్పారు. ఎంతో అద్భుతమైన కథ. సినిమాకు పని చేస్తున్న అందరితో నేను తొలిసారి చేస్తున్నాను. మగధీర తర్వాత బాగా ఎగ్జైట్ అయింది‘ఎవడు' కథ విన్న తర్వాతే. దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందించారు. ఈ సినిమాలో కొంచెం అందంగా కనిపించాను. దానికి కెమెరామెన్ రాంప్రసాదే కారణం. ఈ సినిమాకు పని చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ...బన్నీ కెరీర్లో ‘ఎవడు' బిగ్గెస్ట్ హిట్టవుతుంది. చిరంజీవి 150వ సినిమాలో ఒక్క ఫ్రేములో కనిపించినా చాలు అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ...దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, వంశీ పైడిపల్లి దర్శకత్వం, రామ్ చరణ్ హీరో, హీరోయిన్ శృతి హాసన్, దిల్ రాజు గురించి అందరికీ తెలుసు ఆల్ హిట్స్ ఇచ్చిన నిర్మాత. మా బాస్ మెగాస్టార్ అద్భుతమైన డాన్సర్ అంటే, ఆయన్ను
మించి పోయాడు రామ్ చరణ్.

సాయి కుమార్ మాట్లాడుతూ...ఈ సినిమాలో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అనయ్యతో‘చాలెంజ్' సినిమా చేసాను. ఎవడులో చాలెంజింగ్ రోల్ చేసాను. వంశీ చాలా కమిట్ మెంట్ ఉన్న డైరెక్టర్, దిల్ రాజు ఇన్వాల్వ్ మెంట్ ఉన్న ప్రొడ్యూసర్. దేవిశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడు అన్నయ్యతో చేసాను...చరణ్ తో చేయడం చాలా ఆనందంగా ఉంది. చరణ్ డైలాగులు అదరగొట్టాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉండటం మెగా ఫ్యాన్స్ కు పండగే.

దిల్ రాజు మాట్లాడుతూ....తొలి ప్రేమ నుంచే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యాను. చిరంజీవితో సినిమా చేయాలని కలలో కూడా ఊహించలేదు. పవన్ తో చేయాలని 10 ఏళ్ల నుండి ట్రై చేస్తున్నాను. చరణ్ తో చాన్స్ రావడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారు సింగిల్ సిట్టింగులో విని బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు. దేవితో కలిసి చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ఎవడు సినిమా మెగా అభిమానులు మెచ్చే సినిమా అవుతుంది.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...ఎవడు నా ఒక్కడి కష్టం కాదు. సినిమాకు ఎంతో మంది కష్టపడ్డారు. అందరూ కష్టపడ్డారు కాబట్టే సినిమా అద్భుతంగా వచ్చింది. హరి, వక్కతం వంశీ, అబ్బూరి రవి సహకారం చాలా ఉంది. దేవిశ్రీ మంచి ఫ్రెండ్. శంకర్ దాదా సినిమా అవకాశం రావడంతో దేవిశ్రీ, నేను కలిసి ట్యాంక్ బండ్ వెళ్లి ఎంజాయ్ చేసాం.

చిరంజీవిగారిలో చూడాలనుకున్నది చరణ్ లో చూసాను. అదే ‘ఎవడు' సినిమాలో ప్రజెంట్ చేసాను. బన్నీ చేసింది ఐదు నిమిషాలే అయినా సినిమా అయిపోయే వరకు గుర్తుంటారు. సినిమాకు పని చేసిన ప్రతి వారికి పేరు పేరు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు వంశీ.

శృతి హాసన్ మాట్లాడుతూ...ఎవడు సినిమాకు పండగలాంటి రోజు ఇది. దిల్ రాజుతో కలిసి మూడో సినిమా చేస్తున్నాను. వంశీ మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన మంచి డెడికేటెడ్ డైరెక్టర్. చరణ్ మంచి కోస్టార్. ఆడియోతో పాటు, సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.

English summary
The audio launch of Ram Charan's 'Yevadu' held at Shilpakala Vedika in Hyderabad today. Megastar Chiranjeevi attended as the chief guest and launched the audio CDs. Vamsi Padipally is the director of this film and Devi Sri Prasad is the music director. Shruthi Haasan and Amy Jackson romance Mega Power star in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu