»   » ‘ఎవడు’: రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు

‘ఎవడు’: రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం ఈ నెల 31న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలి రోజు రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అభిమానులకు కోసం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ముఖ్య నగరాల్లో భారీ సంఖ్యలో బెనిఫిట్ షోలు కూడా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా రికార్డు స్థాయి థియేటర్లు, రికార్డు స్థాయి బెనిఫిట్ షోలతో భారీగా ఓపెనింగ్స్ రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు.

ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయిన అంటున్నారు. జయసుధ, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్బీ శ్రీరామ్‌, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సహ నిర్మాతలు: శిరీష్‌ - లక్ష్మణ్‌, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.

English summary
Film Nagar sources said that, fans of the mega powerstar are planning to come up with Yevadu movie special benefit shows and are in talks with important theatres in Hyderabad and other important places across Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu