»   »  యోగేష్ డైరక్టర్ గా భన్సాలీ సినిమా

యోగేష్ డైరక్టర్ గా భన్సాలీ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sanjay Leela Bhansali
దేవదాసు,ఖామోషి,బ్లాక్,సావారియా వంటి చిత్రాలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఆయనిప్పుడు తెలుగు,హిందీలలో ఓ సినిమా చేయాలని భావిస్తున్నారనేది ఫిల్మ్ నగర్ న్యూస్. అయితే ఆయన తెలుగు దర్శకుడు యోగేష్ ని డైరక్టర్ గా ఎంచుకోవటమనేది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. యోగేష్ తాజాగా చింతకాయిల రవి చిత్రం హిట్ తో అందరి దృష్టిలో పడ్డాడు.

అతని మొదటి సినిమా రవితేజా హీరోగా చేసిన ఒక రాజు ఒక రాణి చిత్రం. ఆ చిత్రం భాక్సాఫీస్ ని అలరించలేకపోయింది. అలాగే యోగి మొదటి నుంచీ నేను యాష్ రాజ్ వారి చిత్రంలా హిందీ భారీ చిత్రంలా చింతకాయిల రవి సినిమాను తీర్చిదిద్దుతాను అంటున్నాడు. ఇప్పుడు డైరక్ట్ గా హిందీ సినిమా ఆఫరే వచ్చింది .హ్యాపీ కదా. ఇక ఈ న్యూస్ మిస్ ఫైర్ అవకుండా మెటీరిలైజ్ అయితే మాత్రం యోగి ఎక్కడో ఉండటం ఖాయం.బెస్టాఫ్ లక్ యోగి.త్వరలోనే ఈ సినిమా ప్రారంబమయ్యే అవకాశం ముందని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X