»   » నా గెటప్‌లో నువ్వు చాలా బాగున్నావ్ అన్న సూపర్ స్టార్

నా గెటప్‌లో నువ్వు చాలా బాగున్నావ్ అన్న సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుంది ప్రియాంక చోప్రా. ప్యాషన్ సినిమాలో తనలోని నటనా విశ్వరూపాన్ని సినీ అభిమానులకు చూపించారు. ఇటీవల జరిగిన ఓ అవార్డ్స్ వేడుకలో ప్రియాంక దాదాపు ఆరు రకాల గెటప్స్‌లో కనిపించి అలరించారు. ''అరే.. ప్రియాంకా... నువ్వింత అందంగా ఉంటావనుకోలేదు. నా గెటప్‌లో నువ్వు చాలా బాగున్నావ్"".. అని ఇటీవల జరిగిన ఓ అవార్డ్ వేడుకలో ప్రియాంక చోప్రాను అభినందించారు షారుక్ ఖాన్. ప్రేక్షకుల మధ్యలో కూర్చుని వేదిక మీద ఉన్న ప్రియాంకను ఉద్దేశించి ఆయన అన్న ఈ మాటలకు చప్పట్లతో ఆ ప్రాంగణం హోరెత్తిపోయింది. 'కింగ్ ఖాన్" అందించిన ఈ కాంప్లిమెంట్స్‌కు ప్రియాంక తెగ ఆనందపడ్డారు.

'దబాంగ్"లో సల్మాన్ చేసిన చుల్‌బుల్ పాండే, 'మై నేమ్ ఈజ్ ఖాన్"లో షారుక్ గెటప్, 'రాజ్‌నీతి"లో కత్రినాలా... ఇలా ఇతర నటీనటులు చేసిన గెటప్స్‌లో ఒదిగిపోయి, ఆయా చిత్రాల్లో వారు మాట్లాడిన డైలాగులు మాట్లాడారు ప్రియాంక. ఆమె తన గెటప్ చేసినప్పుడు షారుక్ పై విధంగా స్పందించారు. 'వాట్స్ యువర్ రాశి"లో ఈ బ్యూటీ 12 అవతారాల్లో కనిపించి ఆకట్టుకున్నారు.

త్వరలో విడుదల కానున్న '7 ఖూన్ మాఫ్"లో 20ఏళ్ల యువతిగా, 30ఏళ్ల మహిళగా, 45ఏళ్ల మధ్య వయస్కురాలిగా, 65ఏళ్ల వృద్ధురాలిగా కనిపించబోతున్నారు. ఇలా మొత్తం ఏడుగురి భర్తలతో నటించి, అందరిని చంపేసే దిశగా స్టోరీ సాగుతుందని సమాచారం. ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలైన 7 ఖూన్ మాఫ్ ఆడియోకి కూడా మంచి స్పందన రావడంతో ఈసారి ప్రియాంక మంచి హిట్ కొడుతుందని అంటున్నారు. సినిమా షూటింగ్స్‌లో రీటేక్స్ ఉంటాయి కాబట్టి ఫర్వాలేదు.. కానీ వేదికల మీద పెర్ఫార్మ్ చేసినప్పుడు రీటేకులు ఉండవు. ప్రియాంక తొణకకుండా, బెణకకుండా ఆరు గెటప్స్‌లో అద్భుతంగా అభినయించడంతో సినిమా పరిశ్రమవారితో పాటు వీక్షకులు కూడా విస్తుపోయారట. దానితో అక్కుడున్న వారంతా ప్రియాంకానా మజాకానా అంటూ తెగ అభినందనలతో ముంచెత్తారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu