»   » ప్రభాస్‌తో పెళ్లి వార్తలు: కేసులు పెడతానంటూ అనుష్క వార్నింగ్!

ప్రభాస్‌తో పెళ్లి వార్తలు: కేసులు పెడతానంటూ అనుష్క వార్నింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె లవ్ ఎఫైర్స్ గురించి, పెళ్లి గురించి రకరకాల గాసిప్స్. ఇంతకాలం తన గురించి ఎన్ని రాస్తున్నా సహనంతో భరించిన అనుష్క ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది.

తనపై ఇకపై లేనిపోని వార్తలు రాస్తే ఎంత మాత్రం ఊరుకోను, ఇలాంటివి రాసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని అనుష్క హెచ్చరించింది. ఎప్పుడూ లేనిది అనుష్క ఇంతలా ఆగ్రహానికి గురి కావడం చర్చనీయాంశం అయింది.

బాహుబలి-2 తర్వాత ప్రభాస్‌తో లింకప్

బాహుబలి-2 తర్వాత ప్రభాస్‌తో లింకప్

బాహుబలి-2 విడుదల తర్వాత అనుష్క పెళ్లి గురించి ఈ వార్తల జోరు మరింత పెరిగింది. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని, బాహుబలి షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కేవలం స్నేహం మాత్రమే

కేవలం స్నేహం మాత్రమే

ప్రభాస్ తో పెళ్లి వార్తలపై అనుష్క ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ....తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని, ఇలాంటి గాలి వార్తలు నమ్మవద్దని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

ఆగని ప్రచారం

ఆగని ప్రచారం

అయితే అనుష్క మీడియా ముఖంగా తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని తేల్చి చెప్పినా ఆ వార్తలు మాత్రం ఆగలేదు. కొందరు తన గురించి నీచంగా రాస్తూ తన ఇమేజ్ దెబ్బతీస్తుండటంతో అనుష్క తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

వార్నింగ్

వార్నింగ్

తనపై జరుగుతున్న ప్రచారం కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా నష్టం చేకూర్చే విధంగా ఉండటంతో అనుష్క సహనం కోల్పోయింది. అందుకే ఇకపై ఎవరైనా ఎక్స్‌ట్రాలు రాస్తే కేసులు పెడతానంటూ పరోక్షంగా హెచ్చరించింది.

English summary
It was linked to many people earlier but ever since Baahubali success rumours are rife that Prabhas and Anushka are going to marry soon. Anushka responded on these and said that people have seen her patience side so far and that she will tolerate these rumours henceforth and said will take tough stand on those spreading rumours maligning her image!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu