»   » టీనేజ్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు, గుర్తు పట్టడం కష్టమే కానీ సూపర్ గా ఉన్నాయి (రేర్ ఫొటోలు)

టీనేజ్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు, గుర్తు పట్టడం కష్టమే కానీ సూపర్ గా ఉన్నాయి (రేర్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మీరు ఐశ్వర్యారాయ్ అబిమానా...అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. ఐశ్వర్యారాయ్ చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఎలా ఉండేది. అప్పట్లో అంటే సినిమాల్లోకి రాకముందు ఆమె హాబీలు ఏమిటి..ఖాళీ సమయాన్ని ఎలా గడిపేది. ఆమె రెగ్యులర్ కార్యక్రమాలు ఏమిటి...అవన్నీ మీకు ఈ క్రింద ఫొటోలు చూస్తే ఖచ్చితంగా అర్దమవుతాయి.

ఐశ్వర్యారాయ్ అంటే అందానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగానే చూస్తాం. కానీ ఆమె లో డాన్సింగ్ స్కిల్స్ దాగి ఉన్నాయనే సంగతి మీకు తెలుసా. అంతేకాదు ఆమెకు డాన్స్ నేర్పిన టీచర్ ఎవరో కూడా తెలుసుకోవాలని ఉందా...ఐష్ తన డాన్స్ టీచర్ తో ఉన్నప్పుడు ఫొటోలు మీకు క్రింద అందిస్తున్నాం.

ఇక ఈ ఫొటోలు ఆషామాషీవి కాదు. ఆమె పర్శనల్ ఆల్బమ్ లోవి. అందుకేనేమో ...గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అభిమానులు ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.

ఈ ఫొటోలలో చిన్న వయస్సులో ఉన్న ఐష్. ఆమె డాన్స్ గురువు లత సురేంద్ర ఉన్నారు. ఐష్ అప్పట్లో ఎంత లవ్ లీ ఉండేదో కదా..మేకప్ లేని ఫొటోలు, కల్మషం లేని రోజులు. అప్పటికామె స్టార్ కాదు. పెద్దంటి కోడలు కాదు..ఓ బిడ్డకు తల్లి కాదు..అప్పుడిప్పుడే ప్రపంచాన్ని తెలుసుకుంటున్న ఓ అమ్మాయి అంతే..

స్లైడ్ షోలో ఆ ఫొటోలు చూడండి.

మోడలింగ్ వరల్డ్ లోకి రాకముందే

మోడలింగ్ వరల్డ్ లోకి రాకముందే

ఐశ్వర్యారాయ్ తన డాన్స్ టీచర్ తో ఉన్నప్పటి ఫొటోలు ఇవి. మోడలింగ్ ప్రపంచంలోకి ఇంకా ప్రవేశించని రోజులవి. ఈ ఫొటోలో ఐష్ ని గుర్తు పట్టడం కష్టమే అనిపిస్తుంది. ఐష్ కు చిన్నప్పటినుంచి డాన్స్ అంటే మక్కువ . అందుకే ఇలా ఆమె టీచర్ ని పెట్టుకుని మరీ డాన్స్ నేర్చుకుంది. ఆ ఫొటోలు ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యంగానే ఉంటాయి మరి.

సంగీతం కూడా

సంగీతం కూడా

ఐశ్వర్యారాయ్ గురించి మనకు తెలిసిందిచాలా చాలా తక్కువ. ఆమెను కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే చూస్తాం. కానీ ఆమె మంచి డాన్సర్ అని, ఆమె అందుకోసం చాలా కృషిచేసిందని తెలియదు. అలాగే ఆమె హిందూ స్దాని సంగీతం కూడా నేర్చుకుంది. ఆ వయస్సుకే ఆమె డాన్స్, సంగీతం లో నిష్టాణుతురాలు. పువ్వు పుట్టగానే వికసిస్తుంది అంటే ఇదే మరి.

బ్రయిట్ స్టూడెంట్

బ్రయిట్ స్టూడెంట్

ఐశ్వర్యారాయ్ కేవలం సంగీతం, డాన్స్ అంటూ కాలం గడపలేదు. చదువులోనూ ఆమె నెంబర్ వన్. ఆమె క్లాసులో ఆమె పస్ట్ గా ఉండేది. టీచర్లు ఎప్పుడూ తనను మెచ్చుకుంటూ ఉండేవారని ఇప్పుడు ఐష్ తలుచుకుని మురిసిపోతూంటుంది. ఆమె ను చాలా బ్రయిట్ స్టూడెంట్ అని ఆమె టీచర్లు అంటూంటారు. తన గురువులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూంటుంది.

ఆర్కిటెక్చర్

ఆర్కిటెక్చర్

ఐశ్వర్యారాయ్ తొలుత తీసుకున్న సబ్జెక్ట్ ని ప్రక్కన పెట్టి తర్వాత ఆర్కిటెక్చర్ వైపు ప్రయాణం పెట్టుకుంది. ఆ సబ్జెక్టు అంటే ఆమెు చాలా ఇష్టం. అయితే ఈ లోగా ఆమె దృష్టి మోడలింగ్ పై పడింది. గ్లామర్ ప్రపంచం వైపు అడుగులు వేసింది. ఆ అడుగులతో ఆమె చదువు వెనక్కి వెళ్లింది. కాని ఇప్పటికి తనకు చదువు అంటే ప్రాణం అని ఐష్ చెప్తూంటుంది.

మోడలింగ్

మోడలింగ్

కానీ చిత్రం ఏమిటంటే ఐష్ ఎప్పుడూ కూడా మోడలింగ్ వృత్తిలోకి రావాలని గ్లామర్ ప్రపంచంలోకి రావాలని కల గనలేదట. తన టీచర్ కోసం మొదటి సారి ఫొటో షూట్ లో పాల్గొన్న ఆమె ఆ తర్వాత అనుకోకుండా మోడలింగ్ లోకి వచ్చేసింది. ఆ ప్రపంచం ఆమెకు ఆహ్వానించి, ఆలింగనం చేసుకుంది. ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది.

మిస్ ఇండియా

మిస్ ఇండియా

మోడలింగ్ లోకి వచ్చాక ఐష్ ఆలోచనలు మిస్ ఇండియా వైపు మళ్లాయి. అందుకేనేమో ఆమె తన జీవిత లక్ష్యంగా మిస్ ఇండియా ని పెట్టుకుని అటువైపు అడుగులు వేసింది. ఆ ఆలోచనలే ఆమెను పూర్తిగా గ్లామర్ ప్రపంచంలోకి లాక్కెళ్లిపోయాయి. ఇవే ఆమెకు ప్లస్ అయ్యాయి. వీటితోనే ఆమె జీవితం చివరి వరకూ వెళ్తుందని ఆమె ఊహించలేదు.

మిస్ వరల్డ్

మిస్ వరల్డ్

కానీ మిస్ ఇండియా అనుకున్న ఐశ్వర్యారాయ్ తర్వాత మెల్లిగా మిస్ వరల్డ్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ భారతదేశం గర్వపడేలా..ఇక్కడ ఆడపిల్లలందరూ ఆలోచనలో పడేలా మన దేశ అందానికి కిరీటం తెచ్చిపెట్టింది ఐష్. 1994 సంవత్సరం ఐష్ జీవితంలో పెద్ద మలుపు. ఈ మలుపే కనుక లేకపోతే ఆమె ఎక్కడుండేదో. ఆమె జీవితం ఎటు ప్రయాణం చేసేదో

కష్టపిడి చదివింది

కష్టపిడి చదివింది

ఇక డాక్టరు కాబోయి యాక్టర్‌ని అయ్యాననే మాట ఐశ్వర్యారాయ్‌కి కరెక్టుగా సరిపోతుంది. చదువుకునే రోజుల్లో డాక్టరు కావాలనుకుని అందుకు అనుగుణంగానే కష్టపడి చదివి హెచ్‌ఎస్‌సిలో 90 శాతం మార్కులు కూడా తెచ్చుకుంది. మనం ఒకటి తలిస్తే భగవంతుడు మరొకటి తలుస్తాడన్న విషయం ఐశ్వర్య విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.

బ్రేక్ లు

బ్రేక్ లు


కాలేజీకి రాకముందు డాక్టరు అవ్వాలని అనుకున్న ఆమె కాలేజీకి వచ్చేసరికి మనసు మార్చుకుంది. ఆర్కిటెక్చర్‌ డిగ్రీలో చేరింది. డిగ్రీ ఎలాగైనా పూర్తి చేద్దామనుకున్న ఐష్‌ ఆలోచనలకు ‘మిస్‌ వరల్డ్‌' కిరీటం బ్రేకులు వేసింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది. అందరి మోడల్స్ జీవితాలంలో ఇంకా చెప్పాలంటే అందరి మిస్ వరల్డ్ జీవితాల్లో జరిగిందే జరిగింది.

చిన్న వయస్సులోనే

చిన్న వయస్సులోనే

21 సంవత్సరాలకే మిస్‌ వరల్డ్‌ అయిన ఐష్‌ ఆ తరువాత చదువుకన్నా సినిమాల మీదే దృష్టి పెట్టింది. చదువు పక్కకు నెట్టేసింది. అందుకు కుటుంబం కూడా సహకరించింది. తన చదువుని ప్రక్కన పెట్టి గ్లామర్ ప్రపంచంలోకి వెళ్తున్నా ఎవరూ అడ్డు పెట్టలేదు సరికదా ప్రోత్సహించారు. అదే ఆమెకు ప్లస్ అయ్యింది. ఆ రోజు చదువు అంటూ ముందుకు వెళితే మనకు హీరోయిన్ ఐష్ దొరికేదా

ఈ వయస్సులోనూ

ఈ వయస్సులోనూ

ఐష్ తన అందాన్ని రోజు రోజుకూ పెంచుకుంటూ పోతోందా అనే డౌట్ అందరికీ వస్తోంది. కరుణ్ జోహార్ తాజా చిత్రంలో నటిస్తున్న ఆమె ఈ రోజుకు కూడా కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వని పరిస్దితి తెస్తోంది. చివరి క్షణం వరకూ అన్నట్లుగా తనలో గ్లామర్ ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటానంటోంది ఐష్. అందుకు తగ్గట్లో ఆమె ప్రణాళికలు వేసుకుంటోంది.

యాడ్స్

యాడ్స్

ఐశ్వర్యారాయ్ పెప్సీ యాడ్ తో తొలుత మనలని పలకరించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తో చేసిన ఆ యాడ్ సూపర్ గా క్లిక్ అయ్యింది. ఆ యాడ్ లో ఆమె అందాలకు బాలీవుడ్ ఫిదా అయ్యిపోయింది. ఒక్కసారిగా ఆఫర్స్ ఆమెకు వరస పెట్టి పలకరించాయి. మోడలింగ్ లోనూ బిజి, సినిమాల్లోనూ అదే పరిస్దితి. ఎటు అడుగులు వేయాలి. సినిమానే జయించింది.

English summary
The pictures of young Aishwarya Rai Bachchan with her dance guru Lata Surendra are going viral on the internet. And we must say Aishwarya Rai is looking lovely in all the photos. What say fans?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu