»   » త్రిష,శ్రియ,కాజల్.. వీళ్ళ శకం ముగిసినట్టేనా: వరుస కట్టిన కొత్త హీరోయిన్లు (ఫొటో స్టోరీ)

త్రిష,శ్రియ,కాజల్.. వీళ్ళ శకం ముగిసినట్టేనా: వరుస కట్టిన కొత్త హీరోయిన్లు (ఫొటో స్టోరీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీ వుడ్ లో హీరోయిన్ స్పాన్ చాలా తక్కువ బాలీవుడ్ లో ఉన్నంత ఎక్కువ టైం ఇక్కడ ఉందదు మహా అయితే ఏడేళ్ళు ఇంకా ఎక్కువ అంటే కష్టమే. ఇక అక్కన్నుంచి సెలవు తీసుకోని వెళ్ళిపోవటమో లేదంటే నెమ్మదిగా ఓ రెండు మూడేళ్ళు టైం తీసుకొని అక్క,అమ్మ పాత్రలకి దిగి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టటమో చేయాలి...

ఇక మిగిలిన మూడో మార్గం ఏమిటంటే టీవీ సీరియల్స్ లోకో..రియాలిటీ షో లకి గెస్ట్ గానో వెళ్ళటం...ఇదీ ఇప్పటిదాకా సాగుతున్న ట్రెండ్. ఒక తరం తర్వాత ఇంకొక తరం హీరో యిన్లు ఇలా కనుమరుగు కావటం మామూలే.. ఇప్పటికే మీనా, రోజా, రమ్యకృష్ణా ఇలా ఇంకొదరు నిన్నటి తరం తారలు సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేసారు.

అయితే ఈ నియమం హీరోలకు వర్తించదు. తమతో చేసిన హీరో యిన్ కూతురు తో అయినా కలిసి స్టెప్పులేయగలరు వాళ్ళు.ఇక ఇప్పుడు మనం అనుకున్న రెండో తరం లోకి వెళ్ళ టానికి సిద్దంగా ఉన్న తారల్లో... త్రిష, శ్రియ చేరిపోయారు...ఇద్దరికీ అడపాదడపా తప్ప చాన్సులే లేవు...

ఇక ఇలా వెళ్ళిపోతున్న హీరోయిన్ల స్థానం లో కొత్త వాళ్ళు చేయాలి కదా... అదే ప్రయత్నం లో ఉన్నారు లేటెస్ట్ అందాల భామలు.తమిళ మళయాళ పరిశ్రమలనుంచీ.. ఈ పాపల తాకిడి ఎక్కువయ్యింది. ఈ తరానికి వచ్చే తెలుగు హీరోయిన్ల బ్యాచ్ లో ఒకే ఒక తెలుగమ్మాయి మెగా డాటర్ నిహారిక మాత్రమే..

అయితే తాను గ్లామర్ పాత్రల జోలికి పోననీ నతన ప్రధానమైన పాత్రలకి మాత్రమే తన ఇంపార్టెన్స్ అని చెప్పేసింది కాబట్టి మిగిలిన వాళ్ళ కి నిహారిక ఏమాత్రం పోటీ ఇవ్వదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఇలాంటి నిబంధనలేం ఉన్నట్టు లేవు.

మరి ఇప్పుడున్న నెంబర్ వన్ స్తానం లోనుంచి ఎటూ కాజల్ తప్పుకోబోతోంది కాబట్టి సమంతా ఆ స్థానానికి ఎక్కేసినట్టే. ఇక సమంత హవా కూడా మహా అయితే ఇంకో సంవత్సరం రకుల్ ప్రీత్ సింగ్.., రాశీ ఖన్నా వంటి ఒకరిద్దరు తప్ప పెద్ద పోటీ ఏం లేదిప్పుడు.... మరి ఇప్పుడు వచ్చిన ముద్దుగుమ్మల్లో ఏ హీరోయిన్ ఆ టాప్ పొజిషన్ కి వెళ్తుందో చూడాలి. కుర్ర హీరోలు కూడా వరుసగా ఎంట్రీ ఇవ్వటం తో టాలీవుడ్ కి మంచి కళ వచ్చినట్టే.... ఇంతకీ ఆ కొత్త భామలెవరంటారా....

నివేదా థామస్

నివేదా థామస్

"వెర్రుదే ఒరు భార్య" చిత్రంతో బాలనటిగా మలయాళ చిత్రంతో తెరగేట్రమ్‌ చేసిన ఈ భామ ఆ తర్వాత మలయాళ, తమిళ భాషలో పలు చిత్రాల్లో నటించింది తెలుగులో తొలి చిత్రం జెంటిల్ మేన్ తోనే విమర్శకులను సైతం మెప్పించింది.

అనుపమ పరమేశ్వరన్‌

అనుపమ పరమేశ్వరన్‌

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌' చిత్రంతో వెండి తెరంగేట్రం చేసిన అనుపమ. తాజాగా విడుదలైన "అ ఆ" చిత్రంలో నాగవల్లిగా అందంగా కనిపించి నటనలోనూ మంచి మార్కులే వేయించుకొని. నాగచైతన్యతో సరసన మలయాళ రీమేక్‌ "ప్రేమమ్‌"లో నటిస్తోంది. మరో రెండు తెలుగు, ఒక తమిళ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అన్నట్టు ఈవిడ కూడా మలయాళీ భామే.

నిహారిక

నిహారిక

ఇప్పటివరకూ నటవారసులే తప్ప నటవారసు రాళ్ళు తక్కువే అయిన తెలుగు ఇండస్ట్రీ లో మంచు లక్స్మి ప్రయత్నించినా హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయింది. అయితే ఇప్పుడు రంగం లోకి దిగిన మెగా వారసు రాలు నిహారిక ఇప్పటుఇకే నటనలో మంచి మార్కులే వేయించుకుంది. అయితే గ్లామర్ పాత్రలకు దూరం అని చెప్పి తానెవరికీ పోటీ కానని తేల్చేసింది.

నమితా ప్రమోద్‌

నమితా ప్రమోద్‌

మలయాళంలో విడుదలైన "ట్రాఫిక్‌" చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టి మంచి నటిగా పేరుతెచ్చుకుంది నమితా ప్రమోద్‌. మలయాళం పలు చిత్రాల్లో నటించిన నమితా ఇప్పుడు తెలుగులో ఆదితో "చుట్టాలబ్బాయి", నారా రోహిత్‌తో "కథలో రాజకుమారి" చిత్రాల్లో నటిస్తోంది.

మంజిమా మోహన్‌

మంజిమా మోహన్‌

గతేడాది కేరలలో నివిన్ పాల్ హీరోగా విడుదలైన "ఒరు వడక్కన్‌ సెల్ఫీ" చిత్రంలో చక్కటి నటనను ప్రదర్శించి. తెలుగు తెరపై సందడి చేసేందుకు వస్తోన్న మరో మలయాళీ భామ మంజిమా మోహన్‌. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో అక్కినేనినాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రం "సాహసం శ్వాసగా సాగిపో" వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నందితా శ్వేత

నందితా శ్వేత

కన్నడ భామ నందిత తమిలం లో కూడా నటిస్తోంది. నిఖిల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం "ఎక్కడికి పోతావు చిన్నవాడా". తో తెలుగులో అడుగు పెట్టింది. ఫాంటసీ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో నందితా అవకాశాన్ని దక్కించుకుంది. వీటితో మరో నాలుగు తమిళ చిత్రాలను కూడా చేస్తోంది ఈ కన్నడ పిల్ల.

కీర్తిసురేష్‌

కీర్తిసురేష్‌

"నేను శైలజ" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ భామ కీర్తిసురేష్‌. తెలుగులో తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది.తమిళం, మలయాళ చిత్రాల్లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగుని మాత్రం వదిలేది లేదంటూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది.

మడోనా సెబాస్టియన్‌

మడోనా సెబాస్టియన్‌

అనుపమా పరమేశ్వరన్ తో పాటే "ప్రేమమ్‌" చిత్రంతో మలయాళ చిత్ర సీమలోకి అడుగుపెట్టిన మడోనా నటనకు ముగ్దులైపోయరు జనం. ఎంతలా అంటే మలయాళంలో తనకు పేరుతెచ్చిన జార్జ్‌ పాత్రనే తెలుగులో కూడా చేయమంటూ ఆఫరిచ్చారు. దీనితో పాటు మలయాళ, తమిళ పరిస్రమల్లోనూ ఇప్పుడిప్పుడే బిజీ గా మారుతోంది మడోనా సెబాస్టియన్.

English summary
flow of Beauty s to Tollywood... in these beauty s who will be touch the Top number one place....
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu