Don't Miss!
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- News
50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
గోదావరిలో గల్లంతైన యంగ్ డైరెక్టర్.. షూట్ కోసం వెళ్లి అనంత లోకాలకు!
సినిమానే శ్వాసగా, సినిమానే ఆశగా ఎలాగైనా ప్రతిభ కనబర్చాలని నేటి యువతరం బాగా ఆశ పడుతోంది. ఈ మేరకు సరికొత్త కథలు, అందుకు తగ్గ లేకేషన్స్ ఎంచుకుంటూ టాలెంట్ కి పదును పెడుతున్నారు యువ దర్శకులు. సినిమాల్లోకి అడుగుపెట్టాలంటే ముందుగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తమ టాలెంట్ చూపెట్టడం నేటి యువతరానికి ముఖ్య అస్త్రంగా మారింది.
ఇన్నోవేటివ్ ఆలోచనలతో, సరికొత్త కథలతో షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి అవార్డులు సొంతం చేసుకోవడం, ఆ తర్వాత వెండితెరపై రాణించడంలో నేటితరం యువత సక్సెస్ అవుతోంది. టెక్నాలజీ బాగా విస్తరించడం కారణంగా టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఈజీగా పైకి రాగలుగుతున్నాడు. అందుకే తమ ట్యాలెంట్‌కి పదును పెడుతూ ఎంతో రిస్కీ షూట్స్ చేస్తున్నారు కొందరు. ఈ కోవలోనే పలు షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ రంగుల కలలు గంటున్న ఓ యువ దర్శకుడు, కెమెరామెన్ అర్థాంతరంగా గోదారిలో గల్లంతవ్వడం సంచలనంగా మారింది.

తమ సినిమా షూటింగ్ నిమిత్తమై తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక పిచుకులంక పరిసరాల్లోని గోదావరి నదీ ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు యువకులు.. ప్రమాదవ శాత్తు అదే గోదారిలో మునిగి మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. పోలీసుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం వీరిలో ఒకరు హైదరాబాద్ కి చెందిన కార్తీక్ (35) కాగా.. మరొకరు రాజమండ్రికి చెందిన సుధీర్ (33).
వీరిద్దరూ చాలా కాలంగా స్నేహితులు. ఇద్దరికీ సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చే ఇద్దరినీ ఒకేసారి కడ తేర్చింది. ఇద్దరూ కలిసి షార్ట్ ఫిలిం కోసం లొకేషన్ వెతికేందుకు గోదారి పరిసరాలకు కెచ్చి.. అలా వచ్చి గోదారిలో స్నానానికి దిగగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లు సహాయంతో మృతదేహాలు వెలికి తీశారు. ఇద్దరి కుటుంబ సభ్యులకు వివరాలు అందించి మృతదేహాల్ని పోస్ట్ మార్టమ్ కి తరలించిచారని తెలుస్తోంది. సినిమా ఆశతో వచ్చి ఇలా అనంత లోకాలకు చేరిపోవడం చూసి అక్కడి జనం బాధను వ్యక్తం చేస్తున్నారు.