»   » అభిమాని వార్నింగ్: టెన్షన్ పెట్టొద్దు అంటూ హీరో రామ్ రిక్వెస్ట్!

అభిమాని వార్నింగ్: టెన్షన్ పెట్టొద్దు అంటూ హీరో రామ్ రిక్వెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరో రామ్ అభిమాని తీసుకున్న నిర్ణయంతో కంగారు పడ్డారు. నిరాహార దీక్ష చేస్తానంటూ ఆ అభిమాని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే స్పందించిన రామ్... అతడిని అలాంటి పనులు చేయొద్దు, నాకు కొత్త టెన్షన్స్ పెట్టొద్దు అంటూ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు.

Ram

తరుణ్ సాయి ప్రకాష్ అనే అభిమాని ఒకరు... హీరో రామ్ కొత్త సినిమాలేవీ అనౌన్స్ కాక పోవడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యే వరకు ఉపవాసం ఉంటాను అంటూ ఓ మెసేజ్ పెట్టారు. దీనికి వెంటనే స్పందించిన రామ్ అలాంటివేమీ చేయొద్దు, నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే పనిలోనే ఉన్నాను అని అభిమానిని సముదాయించే ప్రయత్నం చేసారు.

రామ్ నటించిన చివరి చిత్రం 'హైపర్'. ఈ సినిమా విడుదలై దాదాపు 5 నెలలు పూర్తయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రామ్ కొత్త ప్రాజెక్టులేవీ అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. కరుణాకరన్ దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం ఓ సినిమా చేయబోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
After Hyper released hero Ram has not yet revealed any information regarding his next movie. One of the twitter followers of Ram tweeted that he would be fasting until his favorite hero announces his next movie which immediately went to Ram’s knowledge. “ramsayz annaya iam going to start fasting from 2day onwards till we get an announcement of ur nxt project iam saying it for sure DAY1 loveU,” tweeted a fan of Ram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu