Don't Miss!
- Sports
INDvsAUS : భారత్‌తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సుడిగాలి సుధీర్‌తో వర్కౌట్ అవుతుందా? అనుకున్నా.. అప్పుడే కమిటయ్యా.. హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
జబర్దస్త్ వీరుడిగా సుడిగాలి సుధీర్ అందరికీ సుపరిచితమే. కమెడియన్‌గా ఆయన స్కిట్స్ కూడా పరిచయమే. పైగా మంచి పాపులారిటీ ఉన్న పర్సనాలిటీ సుధీర్‌ది. అలాంటిది ఇతగాడి గురించి ఓ హీరోయిన్ బాగా ఎంక్వైరీ చేసిందట. ఆ తర్వాతనే కమిట్ అయిందట. ఇంతకీ ఆ ఎంక్వైరీ ఎందుకు? ఆ కమిట్ ఎందుకోసం? వివరాల్లోకి పోతే..

అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ
ఇన్నాళ్లు బుల్లితెరపై కమెడియన్‌గా, పలు పబ్లిక్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా అలరించిన సుడిగాలి సుధీర్ ఇకపై హీరోగా దర్శనమీయబోతున్నాడు. వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా 'సాఫ్ట్‌వేర్ సుధీర్' విడుదలకు సిద్ధమైంది.

సాఫ్ట్‌వేర్ సుధీర్‌గా సుడిగాలి సుధీర్
శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్‌పై ప్రొడక్షన్ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు 'సాఫ్ట్‌వేర్ సుధీర్' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'రాజుగారి గది' ఫేమ్ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.

సుధీర్‌తో వర్కౌట్ అవుతుందా? అనుకున్నా..
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ధన్య బాలకృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. తాను ఈ సినిమాకు సంతకం చేసే సమయంలోనే సుడిగాలి సుధీర్ గురించి ఎంక్వైరీ చేశానని చెప్పింది ధన్య. అసలు సుధీర్‌తో సినిమా తీస్తే వర్కౌట్ అవుతుందా? లేదా? అనే విషయంపై క్షుణ్ణంగా ఆరా దీశాకే ఈ సినిమాకు ఓకే చెప్పానని ఆమె తెలిపింది.

ఎంక్వైరీలు చేశాకే కమిట్ అయ్యా
గతంలో తాను నటించిన సినిమాలతో పెద్దగా పాపులారిటీ రాలేదు కాబట్టి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడ్డానని చెప్పుకొచ్చింది ధన్య బాలకృష్ణ. ఈ మేరకు తనతో నటించే హీరో సుధీర్‌కు ఫ్యాన్ బేస్ ఎలా ఉందా? సుధీర్‌తో సినిమా చేస్తే సక్సెస్ అయ్యేనా? లాంటి ఎంక్వైరీలు చేశాకే కమిట్ అయ్యానని ధన్య తెలిపింది.

అనుకున్న దానికంటే బాగా..
ఈ రోజుల్లో కొత్త హీరోలతో సినిమాలు చేస్తే విడుదలయ్యే పరిస్థితి కూడా లేదని, అందుకే సుధీర్‌తో సినిమా అనగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని ధన్య తెలిపింది. తాను చేసిన ఎంక్వైరీలో సుధీర్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ ఉందని తేలడంతో.. సినిమా చేశానని ఆమె చెప్పింది. 'సాఫ్ట్‌వేర్ సుధీర్' సినిమా అనుకున్న దానికంటే బాగా వచ్చిందని, ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆమె ఆశాభవం వ్యక్తం చేసింది.

ఇంద్రజ, గద్దర్ కూడా..
సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్' చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ ఓ పాటలో నటించారు. సీనియర్ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్, షాయాజీ షిండే, డా. ఎన్. శివప్రసాద్, పృథ్వీ, సంజయ్ స్వరూప్, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.