»   » ఇండస్ట్రీ హాట్ టాపిక్ ఇదే... రకుల్ పర్స్ లో మెగా హీరో ఫొటో.. వివరణ ఇచ్చిందట కానీ

ఇండస్ట్రీ హాట్ టాపిక్ ఇదే... రకుల్ పర్స్ లో మెగా హీరో ఫొటో.. వివరణ ఇచ్చిందట కానీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ ఫ్యామిలీ హీరోలైన బన్నీ, చెర్రీ, సాయిధరమ్ తేజ్ లతో నటించి మెగా హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం చరణ్ ధృవ, సాయి ధరమ్ తేజ్ విన్నర్ ప్రాజెక్ట్ లలో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ అమ్మడు పవన్ కళ్యాణ్, ఆర్ టీ నీసన్ కాంబోలో రానున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందనే టాక్ వినిపిస్తోంది. ముందుగా నయనతారని తీసుకోవాలని యూనిట్ భావించిన, ఈ అమ్మడు ఆసక్తిగా లేకపోవడంతో రకుల్ ని తీసుకోవాలనే ఆలోచనలో యూనిట్ ఉందని ఇన్ సైడ్ టాక్. రకుల్ ప్రస్తుతం ధృవ టైటిల్ సాంగ్ కోసం థాయ్ లాండ్ లో ఉండగా, అక్కడి నుండి వచ్చాక ఈ విషయంపై స్పష్టత రానుంది. ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది. వేదాళం రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మెయింటెన్ చేస్తున్న హ్యాండ్ బ్యాగ్ లోని ఓ చిన్న పర్సులో మెగాహీరో ఫోటో బయటపటం ఆశ్ఛర్యపరుస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాక్స్ ప్రకారం ప్రస్తుతం సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ల కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ల జంటగా వస్తున్న తాజా చిత్రం 'విన్నర్'. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తాజాగా ఫారిన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.ఈ షెడ్యూల్ లోనే అనుకోకుండా రకుల్ వాలెట్ లో సాయి ధరం తేజ్ ఫొటో ఉండటం చూసిన యూనిట్ సభ్యులు చిన్నగా షాక్ తిన్నారట.

 Young Mega Hero Sai Dharamtej Photo in Top heroine Rakul Preeth's wallet

ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది. ఈ హీరోహీరోయిన్లిద్దరూ గోపిచంద్ మలినేని చిత్రం 'విన్నర్'లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. దీన్లో భాగంగా ఈ జంటపై ఒక పాట కూడా షూట్ చేశారట. ఈ పాటలో ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవడం, దాంతో ఇద్దరి మధ్య క్లోజ్‌నెస్ కూడా పెరిగిపోయాయి. దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారట. అయితే, కావాలని చేశాడో లేక యాధృచ్ఛికంగా జరిగిందో తెలియదు కానీ, దర్శకుడు మలినేని పాట షూటింగ్ జరుగుతు్న సమయంలో రకుల్ వాలెట్‌ను పరిశీలించాడట. దాంట్లో సాయి ధరమ్ ఫొటో ఉండడంతో మలినేని షాక్ తిన్నాడట. దీంతో ఈ విషయాన్ని దర్శకుడు హీరోగారికి చెప్పడంతో... అతగాడు విషయాన్ని రహస్యంగా డీల్ చేయకుండా చిత్రబృందం ముందు పెట్టేశాడట. అయితే, రకుల్ తగిన వివరణ ఇవ్వడంతో అంతా కూల్ అయ్యారట. ఇంతకీ రకుల్ ఇచ్చిన ఆ వివరణ ఏమిటో మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ విషయం అలా ఇలా.. ఫిలింనగర్ చేరడంతో ఇండస్ట్రీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

English summary
winner unit shocked when the found Young Mega Hero Sai Dharamtej Photo in Top heroine Rakul Preeth's wallet on Winner sets
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu