»   » వైఎస్ఆర్ బయోపిక్: మమ్ముట్టి, నాగార్జున, నయనతార.... అసలు నిజం ఇదీ!

వైఎస్ఆర్ బయోపిక్: మమ్ముట్టి, నాగార్జున, నయనతార.... అసలు నిజం ఇదీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి గొప్పనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన్ను ఎంతో మంది దేవుడుగా ఆరాధిస్తుంటారు. త్వరలో వైఎస్ఆర్ జీవిత విశేషాలతో ఓ సినిమా రాబోతోంది. మహి వి. రాఘవ ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

 వైఎస్ఆర్ బయోపిక్‌లో ఏముంటాయంటే..

వైఎస్ఆర్ బయోపిక్‌లో ఏముంటాయంటే..

వైఎస్ఆర్ బయోపిక్‌లో ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు, తన నాయకత్వంలో 2004, 2009 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి వైనం, ప్రజల కోసం ఆయన ఏం చేశారు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.

 వైఎస్ఆర్ వ్యక్తిత్వం

వైఎస్ఆర్ వ్యక్తిత్వం

వైఎస్ఆర్ బయోపిక్‌లో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, బలమైన లీడర్‌గా ఎదగడానికి కారణాలే ఏమిటి? ఆయన ఎలాంటి పాలన ప్రజలకు అందించాలనుకున్నారు అనేది చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం వైఎస్ఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాగార్జున, మమ్ముట్టి, నయనతార పేర్లు తెరపైకి

నాగార్జున, మమ్ముట్టి, నయనతార పేర్లు తెరపైకి

కాగా.... వైఎస్ఆర్ బయోపిక్‌లో ఆయన పాత్రను తెలుగు స్టార్ నాగార్జున లేదా మలయాళ నటుడు మమ్ముట్టి పోషించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే నాగార్జున ఈ సినిమా చేయడానికి ఇష్టపడలేదని, దీంతో మమ్ముట్టిని సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు కూడా మీడియాలో రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపించాయి.

 క్లారిటీ ఇచ్చిన దర్శకుడు, అసలు నిజం ఇది

క్లారిటీ ఇచ్చిన దర్శకుడు, అసలు నిజం ఇది

ఈ వార్తలపై దర్శకుడు మహి వి.రాఘవ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ బయోపిక్‌లో నటీనటుల ఎంపిక జరుగలేదని, వైఎస్ఆర్ పాత్ర ఎవరు పోషిస్తారనే విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదని, ముందు స్క్రిప్టు వర్కు పూర్తి కావాల్సి ఉందని, ఆ తర్వాతే నటీనటులను సంప్రదిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తాము ఎవరినీ సంప్రదించలేదని తెలిపారు.

English summary
Mahi V. Raghava, has announced that he is developing YSR biopic script to direct it. Recent news reports claimed that Nagarjuna and Mammotty are front runners to play the role. Few also said, Mammotty accepted the offer. Mahi, the director clarified to media that none such proposals have been made to Mammotty or any actor to play YSR character. He said soon they will finish script and approach actors but they did not make any offers yet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu