Just In
- 4 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 1 hr ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నన్ను విలన్ గా చిత్రీకరిస్తున్నావు :రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు
బెంగళూరు: వివిద సందర్బాల్లో నోటీసులు అందుకోవటం వర్మ కు కొత్తేమీ కాదు కానీ, జైలులో ఉన్న ఓ ఖైధీ నుంచి నోటీసులు అందుకోవటం మాత్రం కొత్త విషయమై. భూ కబ్జాలు, బెదిరించి డబ్బు వసూలు చేయడం తదితర అభియోగాలతో కర్ణాటకలోని ధార్వాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న యూసఫ్ బచ్చాఖాన్.. సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు పంపారు.
బచ్చా ఖాన్ నోటీసులు పంపటానికి కారణం... గతంలో డాన్‌గా ముద్రపడి ప్రస్తుతం జయ కర్ణాటక సంఘం అధ్యక్షుడిగా ఉన్న ముత్తప్ప రై జీవిత కథను ఆధారంగా చేసుకొని రామ్‌గోపాల్ వర్మ 'రై' పేరుతో సినిమా తీయటమే. ఈ సినిమాకు ఈ నోటిసుకు లింక్ ఏమిటీ అంటే....గతంలో ముత్తప్ప రైకు స్నేహితుడిగా ఉన్నాడు యూసఫ్ బచ్చాఖాన్. అతనే తన లాయర్ ద్వారా వర్మకు నోటీసులు పంపించారు.
ఆ నోటీసులో ఏముంది అంటే... 'రై సినిమాలో నా పాత్రను విలన్ (నెగిటివ్ రోల్)గా చిత్రీకరిస్తున్నావు. మొత్తం కథను నాకు వినిపించిన తర్వాతే సినిమా తీయాల'ని అందులో పేర్కొన్నాడు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా బెదిరించినట్లు సమాచారం. కాగా, ఈ విషయమై రామ్‌గోపాల్ వర్మ న్యాయస్థానం ద్వారానే సమాధానమివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
'రాయ్'గా వివేక్ ఒబెరాయ్, ముత్తప్ప రాయ్ 'గాడ్ ఫాదర్ ఆఫ్ బెంగళూరు' గా పేరుపొందిన ముత్తప్ప రాయ్ నేరజీవితంలోని నాటకీయతతో పోల్చుకుంటే ప్రపంచ ప్రఖ్యాత డాన్లు పాబ్లో ఎస్కోబర్, దావూద్ ఇబ్రహీమ్, అత్ కపొనే లాంటి వాళ్ల జీవితాల్లోని నాటకీయత ఎందుకూ పనికిరానిది' అంటూ తన తాజా చిత్రం 'రాయ్' ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ.
ముత్తప్ప రాయ్ పుట్టిన రోజు సందర్భంగా మే 1న 'రాయ్' ఫస్ట్ లుక్ ని స్వయంగా ముత్తప్పరాయే దాన్ని విడుదల చేసారు.మొదట 'అప్ప'గా అనుకున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రకు సుదీప్ ను ఎంపికచేశారు.
అయితే అనివార్యకారణాలవల్ల సుదీప్ స్థానంలో వివేక్ ఒబెరాయ్ ని రాయ్ పాత్రకోసం ఫైనలైజ్ చేశామని, బెంగళూరు, మంగళూరు, ముంబై, దుబాయ్, లండన్ తదితర దేశాల్లో షూటింగ్ చేస్తామని వర్మ తెలిపారు. సీఆర్ మనోహర్ ఈ సినిమాకు నిర్మాత.

బెంగళూరుకు చెందిన ముత్తప్ప రాయ్ యువకుడిగా ఉన్నప్పుడు నేర సామ్రాజ్యంలోకి ప్రవేశించి, డాన్ గా ఎదిగాడు. తనపై హత్యాయత్నం జరగటంతో దుబాయ్ పారిపోయిన రాయ్.. అక్కడ దావూద్ తో కలిసి నేరాలు కొనసాగించారు. 2002లో అనూహ్యంగా ఇండియాకు వచ్చి పోలీసులకు లొంగిపోయిన ముత్తప్ప 2008లో జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రజాసేవకు అంకితమయ్యాడు.
'జయ కర్ణాటక' ఫౌండేషన్ ద్వారా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అటు హోటల్ వ్యాపారాల్లోనూ రాణిస్తూ ఉత్తమ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్ చిత్రమే 'రాయ్'.
బెంగళూరు కేంద్రంగా కర్ణాటకలోనే కాక దుబాయ్ కేంద్రంగా పలు దేశాల్లో దందాలు చేసి, క్రైమ్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్న ముత్తప్పరాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ్, హిందీల్లో రూపొందించనున్నట్లు వర్మ తెలిపారు.