twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రేయ్‌' విడుదల కోసం ఎన్టీఆర్ ని ప్రార్దించా

    By Srikanya
    |

    హైదరాబాద్ : వైవియస్ చౌదరి చిత్రం 'రేయ్‌' పూర్తి అయ్యి చాలా కాలం అయినా విడుదల కాలేదు. సాయి ధరమ్ తేజ చేసిన రెండో చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం విడుదల అయ్యింది కానీ ఫైనాన్సియల్ కారాణాలతో 'రేయ్‌' ఆగిపోయింది. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్ధితిలో ఉన్న ఆ ప్రాజెక్టు గురించి చాలా రోజుల తర్వాత వైవియస్ చౌదరి మీడియాతో మాట్లాడారు.

    వైవియస్ చౌదరి మాట్లాడుతూ '''రేయ్‌' విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయకుండా కష్టపడ్డా. ఈ సినిమా విడుదల విషయంలో నాకు శక్తిని ప్రసాదించమని ఎన్టీఆర్ ని ప్రార్థించా. అందరి సహకారంతో త్వరలోనే 'రేయ్‌' చిత్రాన్ని విడుదల చేస్తాను. ఎన్టీఆర్‌ నా దేవుడు. నన్ను పై నుంచే ఆయన దీవిస్తుంటారని నా నమ్మకం. ఎలాంటి కష్టం వచ్చినా ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి 'అన్నా...' అని వేడుకొంటా''అన్నారు.

    YVS chowdary about his latest Rey Movie

    అలాగే...‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి దివ్య మోహన రూపం.. ఆయన సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు ఎందరికో స్ఫూర్తినిచ్చింది. రాజకీయంలో ఉన్నప్పుడు మరెందరినో చైతన్యవంతుల్ని చేసి, ఇంకెంతో మందికి మార్గదర్శకంగా నిలిచింది. తన జీవన విధానం ద్వారా చాలా ఆశయాల్ని మన ముందు వదిలివెళ్ళారు. ఏ పనినైనా అంకితబావంతో చేయడం, పనిని సాధించడంలో మడమ తిప్పని పోరాటం చెయ్యడం ఆయన నైజం.

    హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన రామాయణ, మహాభారత, భాగవతాల పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన ముందు కనిపించి, అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ ఒక కారణజన్ముడిగా, యుగపురుషుడిగా అవతరించారు. ఎన్టీఆర్‌ నాకు దేవుడితో సమానం. ఆయన మీదున్న అభిమానంతోనే సినిమాల్లోకి వచ్చాను.

    నాకై ఓ సొంత సినిమా బ్యానర్‌ ‘బొమ్మరిల్లు వారి'ని స్థాపించాను. పైనుండి ఆయన ఆశీస్సులు నాకుంటాయని నమ్మకం. ‘రేయ్‌' సినిమా పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. త్వరలోనే నా టీమందరి సహకారంతో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాను. ఈరోజు నేను దేవుడిగా భావించే ఎన్టీఆర్‌ వర్ధంతి కాబట్టి ఈ సినిమా విడుదల ప్రయత్నంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా మరొక్కసారి ఆశీర్వదించమని దేవాలయంలాంటి ఆయన ఘాట్‌కి వచ్చి ప్రార్థిస్తున్నాను'' అని చెప్పారు.

    ''అంకితభావంతో పనిచేయడంతో పాటు, అనుకొన్నది సాధించేవరకు మడమ తిప్పకూడదనేవారు ఎన్టీఆర్‌. ఆయన ఆశయాలతోనూ, ప్రసంగాలతోనూ ఎంతోమంది స్ఫూర్తి పొందారు. అందులో నేనూ ఒకడిని. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకొనే సినిమా రంగంలోకి వచ్చాను'' అన్నారు వైవీయస్‌ చౌదరి. ఎన్టీఆర్‌ వర్ధంతిని సందర్భంగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు వైవీయస్‌ చౌదరి.

    ''రేయ్‌.. రామ్‌చరణ్‌ కోసం రాసుకొన్న కథ. అయితే సాయిధరమ్‌తేజ్‌లో ఒకప్పటి చిరంజీవిగారి పోలికలు కనిపించాయి. అందుకే తనతో ఈ సినిమా తెరకెక్కించా'' అంటున్నారు వైవీఎస్‌ చౌదరి. ఆయన నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'రేయ్‌'. సాయిధరమ్‌తేజ్‌, సయామీఖేర్‌ జంటగా నటించారు. శ్రద్దాదాస్‌ కీలక పాత్రధారి.

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''నాకు శిరీష్‌ ఎంతో సాయీ అంతే. చిన్నప్పటి నుంచీ తనకి సినిమాలంటే పిచ్చి. 'సాయిని హీరోని చేసేద్దామా?' అని చరణ్‌ని చాలాసార్లు అడిగా. 'వాడు బుద్ధిగా చదువుకొంటున్నాడు కదా.. వదిలేయ్‌' అన్నాడు. తీరా చూస్తే 'రేయ్‌' సినిమా చేసేశాడు. సాయిని హీరోగా మార్చిన వైవిఎస్‌ చౌదరికి కృతజ్ఞతలు'' అన్నారు. ''నా కష్టం వెనుక బన్నీ అందించిన సహకారం చాలా ఉంది. కుదిరితే వైవిఎస్‌ చౌదరితో మరో సినిమా చేస్తా'' అన్నాడు సాయిధరమ్‌ తేజ్‌.

    వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

    ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

    వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్‌ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్‌ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్‌, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. '' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి మీడియాకు తెలియచేసారు.

    అలాగే...''ఈ సినిమాకి చాలా సమయం పట్టింది. దానికి కారణం... ఈ సినిమాలోని విషయం అలాంటిది. సినిమా చూస్తే ఇంతకాలం ఎందుకు పట్టిందో మీకే అర్థం అవుతుంది'' అన్నారు.చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

    English summary
    YVS chowdary directed Sai Dharam’s debut movie Rey and it was halted in labs due to financial problems.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X