For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ముగింపు దశలో చిరు మేనల్లుడి సినిమా‘రేయ్’

  By Bojja Kumar
  |
  హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి సోదరి విజయ పెద్ద కుమారుడు సాయి ధరమ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత వై.వి.ఎస్ చౌదరి అందిస్తున్న చిత్రం 'రేయ్'. ఇప్పటి వరకు రామ్, ఇలియానా, అంకిత తదితర తారలను చౌదరి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా సాయి ధరమ్ తేజ్ తో పాటు ప్రమఖ నటి షబానా అజ్మి మేనకోడలు సయామీ ఖేర్‌ను ఆయన కథానాయికగా పరిచయం చేస్తుండటం విశేషం. శ్రద్ధాదాస్ మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది.

  బొమ్మరిల్లు వారి పతాకంపై యలమంచిలి గీత సమర్పణలో వైవీఎస్ నిర్మిస్తున్న ఈచిత్రం రెండు పాటలు, యాక్షన్ సీక్వెన్స్ మినహా పూర్తయింది. ఈ చిత్ర విశేషాలను వైవిఎస్ చౌదరి చెబుతూ...'ఇది మ్యూజికల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్. 'షౌట్ ఫర్ సక్సెస్' అనేది ఉప శీర్షిక. సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. డాన్స్, ఫైట్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. టాలీవుడ్ కి మరో ఎనర్జిటిక్ హీరో దొరికాడని నమ్మకంగా చెబుతున్నాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు గార్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసే విధంగా ఈ చిత్రాన్ని నేను తెరకెక్కిస్తున్నాను. కథానుసారం ఒక వినూత్నమైన పంథాలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అమెరికా, వెస్టిండీస్ లో ఎక్కువ శాతం షూటింగ్ చేసాం. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రదేశాల్లో కొంత షూటింగ్ చేశాం. మిగిలిన రెండు పాటలను, యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్రస్తుతం హైదరాబాద్ లోని చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రాన్ని మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.

  సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధా దాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, నరేష్, అలీ, రఘుబాబు, వేణు మాధవ్, రంకా అర్పిత్, మణికిరణ్, సుభాష్, మధు, నీలేష్, హేమ, యలమంచిలి యుక్త తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి అడిషనల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, రాజసింహ, రచన : శ్రీధర్ సీపాన, సంగీతం : చక్రి, పాటలు : చంద్రబోస్, డైరెక్టర్ ఆఫ్ ఫోటో గ్రఫీ : గుణశేఖరన్, ఫైట్స్ : గణేష్, స్టన్ శివ, ఆర్ట్ : రఘు కులకర్ణి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, కోరియోగ్రఫీ : రాజుసుందరం, శేఖర్, భానోదయ, కో-డైరెక్టర్ : మల్లి కె. అర్జున్, ప్రొడక్షన్ కంట్రోలర్ : జాస్తి రవి, సమర్పణ : యలమంచిలి గీత, కథ-స్ర్కీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం : వై.వి.ఎస్. చౌదరి.

  English summary
  Sai Dharma Tej's Rey movie shooting compleat except Two songs and Action Sequence. Chakri is composing the music. YVS Chowdary is producing and directing the movie as well.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X