రెండు సీక్వెల్ చిత్రాలు,టైటిల్స్ ప్రకటించిన వై.వి.ఎస్.చౌదరి.
హైదరాబాద్ : ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది. ఆ దారిలో దర్శకుడు, నిర్మాత వై.వి.ఎస్.చౌదరి కూడా నడవటానికి నిర్ణయించుకున్నారు. తన హిట్ చిత్రాలు 'లాహిరి లాహిరి లాహిరిలో' , 'సీతయ్య చిత్రాలకు సీక్వెల్స్ నిర్మించబోతున్నట్లు మీడియాకు తెలియచేసారు.
ఆ చిత్రాల టైటిల్స్ ఏమిటంటే... 'లాహిరి లాహిరి లాహిరిలో'కి కొనసాగింపుగా 'కృష్ణా ముకుందా మురారి', 'సీతయ్య'కి రెండో భాగం 'ఎవరి మాటా వినడు' అనే చిత్రాలు నిర్మించబోతున్నట్లు చెప్పారు.
అలాగే వీటితో పాటు 'థ్యాంక్స్ బేబి', 'సీఎం' - కామన్‌మేన్ అనే పేర్లతో చిత్రాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నారు. ఈ నాలుగు చిత్రాల్లోని నటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఇక తన బ్యానర్ గురించి చెప్తూ... ''బొమ్మరిల్లు అంటే సినిమాలు తీసే ఇల్లు అనే అర్థంలో చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టాను. పదకొండేళ్ల కిందట మేడే సందర్భంగా సంస్థను ప్రారంభించిన క్షణాలను మరచిపోలేను'' అన్నారు వై.వి.ఎస్.చౌదరి. ఆయన ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్' త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది.


Click it and Unblock the Notifications












