twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయిధరమ్ తేజ్‌ 'రేయ్' విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్' . షూటింగ్ లేటైనా ట్రేడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

    ఈ చిత్రం గురించి వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది. ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

    Rey
    .నా గత చిత్రం విడుదలకు ముందు 'రేయ్' సినిమా రూపొందించే బాధ్యత నాకు అప్పగించింది మెగా ఫ్యామిలీ. అది జరిగిన కొన్ని రోజులకు నా సినిమా విడుదలై అపజయం పొందింది. వెంటనే మెగా బ్రదర్స్‌లో ఒకరైన పవన్‌కళ్యాణ్‌గారికి నా బాధ్యతగా ఒక మెసేజ్ ఇచ్చాను. అదేమిటంటే.. ఈ సినిమా రిజల్ట్ దృష్ట్యా మీ మేనల్లుడి సినిమా విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను ఇబ్బంది పడను.. అని. ఐదు నిముషాలు గడిచాయో లేదో పవన్‌కళ్యాణ్‌గారి నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చింది.

    ఆ మెసేజ్ లో.... 'జయాపజయాలు నాకు ముఖ్యం కాదు.. వ్యక్తిత్వం, అంకితభావం నాకు ముఖ్యం. మీ కమిట్‌మెంట్, కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. అందుకే ఎటువంటి సంకోచం లేకుండా ముందుడుగు వెయ్యండి. మీకు అండగా నేనున్నాను...' అంటూ ఇచ్చారు. ఆ రోజు పవన్‌కళ్యాణ్‌గారు ఇచ్చిన మెసేజ్ నాకు ప్రోత్సాహాన్నిచ్చి, ఎక్కడా రాజీపడకుండా 'రేయ్' సినిమాని తీసేలా చేసింది.
    నా 28 ఏళ్ల సినీజీవితంలో దర్శకుడు అపజయాల్లో ఉన్పప్పుడు ఓ స్టార్ హీరో నుంచి ఇటువంటి మెసేజ్ అందుకోవడం ఇదే ప్రథమం. అందుకు ఈ సందర్భంగా వపన్‌కళ్యాణ్‌గారికి హాట్సాఫ్ చెబుతున్నా అన్నారు. నరేశ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ల భరణి, వేణుమాధవ్, రఘుబాబు, హేమ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సాహిత్యం: చంద్రబోస్.

    English summary
    YVS Chowdhary has announced that he would be releasing his upcoming film, Rey, for Sankranthi festival. The film introduces Chiranjeevi's nephew Sai Dharam Tej as hero. Rey has been in the making for long time. And it is finally gearing up for release for Pongal 2014. "It is a love story with mass elements. It is the same genre of Devadas (2006) and Desamuduru (2007). As per the story, before interval the movie is set in West Indies and post interval the story revolves in USA," YVS says.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X