»   » 'ఎవడు‌' వస్తోందనే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాం

'ఎవడు‌' వస్తోందనే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : సంక్రాంతికి కోడి పందాల్లా...తెలుగు సినిమాలు థియోటర్స్ లో పోటీ పడుతూంటాయి. ఈ పోటికి అందరు హీరోలు,దర్శకులు ఉత్సాహం చూపిస్తూంటారు. అయితే పోటీ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు థియోటర్స్ సమస్య వంటివాటితో వెనకడుగు వేస్తారు. తాజాగా వైవిఎస్‌ చౌదరి దర్శకత్వం వహించిన 'రేయ్‌' చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకొంది. ఫిబ్రవరి 5న విడుదల చేయాలని నిర్ణయించారు. త్వరలో పాటల వేడుక నిర్వహిస్తారు. సాయిధరమ్‌తేజ్‌, సయామీఖేర్‌ జంటగా నటించారు. ఈ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

  వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ' మొదట మా రేయ్ చిత్రాన్ని సంక్రాంతికి తెద్దామనుకున్నాం. అయితే రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు ని సంక్రాంతికి పోస్ట్ ఫోన్ చేసారు. దాంతో మేము కూడా మా రిలీజ్ డేట్ ని పిబ్రవరికి ఛేంజ్ చేసుకున్నాం.' అని తెలిపారు.

  అలాగే ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది. ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి

  .నా గత చిత్రం విడుదలకు ముందు 'రేయ్' సినిమా రూపొందించే బాధ్యత నాకు అప్పగించింది మెగా ఫ్యామిలీ. అది జరిగిన కొన్ని రోజులకు నా సినిమా విడుదలై అపజయం పొందింది. వెంటనే మెగా బ్రదర్స్‌లో ఒకరైన పవన్‌కళ్యాణ్‌గారికి నా బాధ్యతగా ఒక మెసేజ్ ఇచ్చాను. అదేమిటంటే.. ఈ సినిమా రిజల్ట్ దృష్ట్యా మీ మేనల్లుడి సినిమా విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను ఇబ్బంది పడను.. అని. ఐదు నిముషాలు గడిచాయో లేదో పవన్‌కళ్యాణ్‌గారి నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చింది.

  ఆ మెసేజ్ లో.... 'జయాపజయాలు నాకు ముఖ్యం కాదు.. వ్యక్తిత్వం, అంకితభావం నాకు ముఖ్యం. మీ కమిట్‌మెంట్, కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. అందుకే ఎటువంటి సంకోచం లేకుండా ముందుడుగు వెయ్యండి. మీకు అండగా నేనున్నాను...' అంటూ ఇచ్చారు. ఆ రోజు పవన్‌కళ్యాణ్‌గారు ఇచ్చిన మెసేజ్ నాకు ప్రోత్సాహాన్నిచ్చి, ఎక్కడా రాజీపడకుండా 'రేయ్' సినిమాని తీసేలా చేసింది. నరేశ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ల భరణి, వేణుమాధవ్, రఘుబాబు, హేమ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సాహిత్యం: చంద్రబోస్.

  English summary
  Rey will come to the theatres on Feb 5th, 2014. "As Ram Charan starrer Yevadu is postponed to Sankranthi festival, we have changed our movie's release date too. We planned Rey for Sankranthi but we have now locked Feb 5th as release date," said producer and director YVS Chowdhary. He is launching megastar's nephew Sai Dharam Teja as leading hero in his current film, Rey.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more