»   » హీరోయిన్ సాగరిక, క్రికెటర్ జహీర్ ఖాన్ ఎంగేజ్మెంట్, ప్రముఖుల సందడి (ఫోటోస్)

హీరోయిన్ సాగరిక, క్రికెటర్ జహీర్ ఖాన్ ఎంగేజ్మెంట్, ప్రముఖుల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి సాగరిక ఘట్కే, క్రికెటర్ జహీర్ ఖాన్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ముంబైలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ వేడుకలో సాగరిక-జహీర్ జంట ఎంతో అందంగా మెరిసిపోయారు.

'చక్ దే ఇండియా'లో నటించిన సాగరిక ఘట్కే, ప్రముఖ క్రికెటర్ జహీర్ ఖాన్ మధ్య ఎఫైర్ ఉందని, ఇద్దరూ కలిసి కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని చాలా కాలంగా రూమర్స్ వినిపించాయి. అప్పటి వరకు సీక్రెట్ గా తమ ప్రేమ వ్యవహారం కొనసాగించిన గత నెలలో ఐపీఎల్ జరుగుతుండగా ఓపెన్ అయిపోయారు. ఐపీఎల్ మ్యాచ్ ల గ్యాపులో సాగరికను గోవా తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ జహీర్ ప్రపోజ్ చేసాడు. ఆమె అందుకు ఓకే చెప్పడంతో ఈ విషయాన్ని నెల రోజుల క్రితమే అభిమానులకు ట్విట్టర్ ద్వారా అపీషియల్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే.

అఫీషియల్

అఫీషియల్

సాగరిక-జహీర్ ఖాన్ ఎంగేజ్మెంట్ అఫీషియల్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సచిన్, కోహ్లితో పాటు పలువురు ప్రముఖ క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.

విరాట్-అనుష్క

విరాట్-అనుష్క

జహీర్ ఖాన్ ఎంగేజ్మెంట్ వేడుకలో తన ప్రియురాలు అనుష్కతో కలిసి విరాట్ కోహ్లి. త్వరలో వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటారని టాక్.

వావ్ జంట... అందమైన జంట

వావ్ జంట... అందమైన జంట

ఎంగేజ్మెంట్ వేడుకలో సాగరిక-జహీర్ ఎంతో అందంగా మెరిసిపోయారు. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారని అంటూ అభిమానులు సోషల్ మీడియా సందేశాలు పంపారు.

భార్యతో కలిసి సచిన్

భార్యతో కలిసి సచిన్

జహీర్ ఖాన్ ఎంగేజ్మెంట్ వేడుకకు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి హాజరయ్యారు.

ఒకరి చేయి ఒకరు విడవని అనుష్క-విరాట్

ఒకరి చేయి ఒకరు విడవని అనుష్క-విరాట్

ఎంగేజ్మెంట్ వేడుకలో అనుష్క, కోహ్లి ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఆ ప్రాంగణంలో తిరుగుతూ మీడియాలో హైలెట్ అయ్యారు. వీరి మధ్య కెమిస్ట్రీ చూసిన వారంతా..... వీరికి కూడా పెళ్లికి తొందరే ఉన్నట్లు ఉందని గుసగుసలాడుకున్నారు.

మందిరా బేడీ

మందిరా బేడీ

సాగరిక-జహీర్ ఎంగేజ్మెంట్ వేడుకలో స్టన్నింగ్ పింక్ కలర్ ఔట్ ఫిట్ లో మందిరా బేడీ.

కైఫ్-అగార్కర్

కైఫ్-అగార్కర్

ఎంగేజ్మెంట్ వేడుకలో సాగరిక, జహీర్ లతో కలిసి క్రికెటర్లు కైఫ్, అగార్కర్ తదితరులు.

విందులో

విందులో

సాగరిక-జహీర్ ఎంగేజ్మెంట్ విందులో సచిన్, కైఫ్, అగార్కర్ తదితరులు.

ప్రాచీ దేశాయ్

ప్రాచీ దేశాయ్

సాగరిక-జహీర్ ఎంగేజ్మెంట్ వేడుకలో బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్.

విష్ చేయండి

విష్ చేయండి

ఎంగేజ్మెంట్ జరుపుకున్న సాగరిక, జహీర్ లకు శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేయండి. ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
Love birds Zaheer Khan and Sagarika Ghatge got engaged in a star studded ceremony as cricketers, Bollywood stars, friends and family members made a beeline to wish the couple before they began a new chapter in life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu