»   » లీగల్ సమస్యల్లో రామ్ చరణ్ తాజా చిత్రం

లీగల్ సమస్యల్లో రామ్ చరణ్ తాజా చిత్రం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: రామ్ చరణ్ హిందీలో ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం 'జంజీర్'. ఈ చిత్రం మొదలైన దగ్గరనుంచి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా ఈ చిత్రం రైట్స్ విషయమై లీగల్ సమస్యలు మొదలయ్యాయి. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని టెర్మినేట్ చేస్తూ హక్కుదారులు లీగల్ నోటీసులు పంపిచారు.

  ముందుగా అనుకున్న డబ్బు సెటిల్ చేసి ఇవ్వకపోవటం వల్ల జంజీర్ రైట్స్ కాన్సిల్ చేస్తున్నట్లు హక్కుదారులు తేల్చి చెప్పి కోర్టు కెక్కారు. ఇక ఈ వివాదం మొదలైంది చిత్రం రైట్స్ కి చెందిన ముగ్గురు అన్నదమ్ముల మధ్యనే కావటం విశేషం. తమ తండ్రి నిర్మించిన జంజీర్ రైట్స్ కొడుకులకు రాగా, అందులో ఒకతను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మిగతా ఇద్దరు సోదరులకు హక్కులు తాలుకు డబ్బులిస్తానని చెప్పాడు.

  కానీ మొదట అనుకున్న ప్రకారం ఇవ్వకపోవటంతో వారు కోర్టుకు ఎక్కారు. ఇప్పుడు వ్యవహారం కోర్టుకు వెళ్లింది. సినిమా షూటింగ్ కి ఇది ఏ విధమైన ఇబ్బంది ఎదురౌతుందో అనే సందేహంలో ఇప్పుడు హీరో, దర్శకులు పడ్డారు. ముఖ్యంగా ఇప్పుడెలా ఉన్నా విడుదల సమయంలో ఏ విధమైన లీగల్ తలనొప్పులూ ఉండకూడదు. అప్పుడు క్లియరెన్స్ రాకపోతే చాలా పెద్ద సమస్య. ఈ లోగా సెటిల్ చేసుకుంటారనే అనుకుంటున్నారు.

  ఇక ఇంతకుముందు కూడా ఈ రీమేక్ హక్కులకు సంభందించిన వ్యవహారం కోర్టుకు వెళ్లింది. తమ అనుమతి లేకుండా,తమకు రాయల్టి చెల్లించకుండా ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యటానికి వీల్లేదంటూ ఒరిజనల్ సినిమాకు రచన చేసిన సలీం ఖాన్,జావేద్ లు అభ్యంతరం వ్యక్తం చేసి లీగల్ నోటీసులు పంపారు. అయితే ఈ సమస్యను దర్శక,నిర్మాతలు జాగ్రత్తగా డీల్ చేసి సాల్వ్ చేసుకున్నారు.

  జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్.. విజయ్ గా కనిపించనున్నాడు..మాలా గా ప్రియాంక చోప్రా, తేజగా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సోనూసూద్(తెలుగు వెర్షన్ కి), సంజయ్ దత్(హిందీ వెర్షన్ కి), మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

  English summary
  The remake of late Prakash Mehra's 1973 blockbuster Zanjeer being produced by his son Amit Mehra has run into hot water. Amit, who had bought the remake rights from his brothers-the elder one Sumeet who stays in the US and the younger sibling Puneet who stays in Mumbai - has defaulted on payments. Consequently, Sumeet and Puneet have terminated the contract that gave Amit there make rights in the first place. The Arbitrator upheld the termination of the contract, which is why Amit panicked and approached the Bombay High Court. As per the HC order , Amit has been given a reprieve to shoot the film. However, he cannot release the remake until further orders from the HC.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more