బంగారం, వెండి ధరలు పతనం.. MCX లో కుప్పకూలిన సిల్వర్ ఫ్యూచర్స్.. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలతో భారీగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు కిందికి చూస్తున్నాయి. ఈ వారంలో బంగారం ధరలు చాలా వరకు తగ్గి సామాన్యులకు ఊరటనిచ్చాయి. ఇక ఫిబ్రవరి 10న ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఒత్తిడి ప్రభావంతో భారతదేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత సెషన్‌లో బలమైన ర్యాలీ తర్వాత.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు విలువైన లోహాలపై అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు 1 శాతం నుంచి 2 శాతం వరకు పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో కీలక సూచిక అయిన COMEX బంగారం ఔన్సుకు 5,050 డాలర్ల స్థాయికి దిగువకు జారింది. ప్రస్తుతం దాదాపు 1 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అదే సమయంలో, వరుసగా రెండు రోజులు లాభపడిన స్పాట్ సిల్వర్ ధరకు బ్రేక్ పడింది. డాలర్ బలపడటంతో పాటు లాభాల స్వీకరణ నేపథ్యంలో, వెండి ధర ఔన్సుకు 82 డాలర్ల వద్ద సుమారు 2 శాతం తగ్గింది.

ఈ గ్లోబల్ ట్రెండ్ ప్రభావం దేశీయ మార్కెట్‌లోనూ స్పష్టంగా కనిపించింది. ఫిబ్రవరి 10న MCX బంగారం ధర సుమారు రూ.1.55 లక్షల స్థాయికి చేరిన తర్వాత వెనక్కి తగ్గింది. మరోవైపు MCX వెండి ధర కీలకమైన రూ.2.7 లక్షల మార్కు కిందకు పడిపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే అమ్మకాలు పెరగడంతో ధరలు దిద్దుబాటుకు గురయ్యాయి.
మార్చి 2026 గడువు ముగిసే MCX వెండి ఫ్యూచర్స్ దాదాపు 2 శాతం పడిపోయి 10 గ్రాములకు రూ.2,57,523 వద్ద ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో వెండి ధర రూ.2,56,908 వరకు పడిపోవడం గమనార్హం. దీంతో కీలకమైన రూ.2.6 లక్షల మద్దతు స్థాయిని వెండి కోల్పోయింది. ఇదే సమయంలో ఏప్రిల్ 2026 గడువు ముగిసే MCX గోల్డ్ ఫ్యూచర్స్ సుమారు 1 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,55,394 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.1,55,997కు దగ్గరగా ఉంది.
బంగారం ధరల పెరుగుదలపై మరో బాంబు పేల్చిన అమెరికా.. చైనా వల్లే మనకు ఈ దుస్థితి అంటూ..
విలువైన లోహాల మార్కెట్ ప్రస్తుతం తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ.. నిపుణులు దీర్ఘకాలికంగా బంగారం, వెండి పై జాగ్రత్తగా బుల్లిష్ దృక్పథాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ రాబోయే నెలల్లో అమెరికాలో ఉద్యోగ వృద్ధి మందగించే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది.
ఇక ముందున్న కీలక అమెరికా ఆర్థిక డేటాపై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకృతమైంది. బుధవారం విడుదల కానున్న నాన్-ఫార్మ్ పేరోల్స్ నివేదిక, అలాగే గురువారం, శుక్రవారం భారత్, అమెరికా దేశాల్లో విడుదలయ్యే CPI ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. ఇవే ఫెడరల్ రిజర్వ్ మరియు RBI తదుపరి వడ్డీ రేట్ల విధానంపై కీలక సంకేతాలను ఇవ్వనున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లు 2026లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి రెండు సార్లు 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల కోతలు ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి. ఇది బులియన్ ధరలకు దీర్ఘకాలికంగా మద్దతు ఇవ్వగల అంశంగా నిపుణులు చెబుతున్నారు. అదనంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సేఫ్ హేవెన్ డిమాండ్‌కు మద్దతునిస్తున్నాయి.
ఇక చైనా జనవరిలో వరుసగా 15వ నెల కూడా Gold కొనుగోళ్లను కొనసాగించడం గ్లోబల్ డిమాండ్ బలంగా ఉందని సూచిస్తోంది. ఈ అన్ని అంశాల మధ్య, తక్షణ కాలంలో ధరల్లో ఒడిదుడుకులు కొనసాగినా.. మధ్యకాలికంగా Gold, వెండి పై పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Credit: Goodreturns


Click it and Unblock the Notifications











