Don't Miss!
- News
Jewelery: మా బంగారం, జ్యువెలరీ షోరూమ్ ఓనర్లకు సినిమా చూపించిన ఐటీ శాఖ, అర్దరాత్రి సెకండ్ షో !
- Finance
February 1st: కొత్త నెల మారిన రూల్స్.. తప్పక తెలుసుకోండి.. గోవా పర్యాటకులకు ప్రత్యేకం..
- Sports
INDvsNZ : సిరీస్ డిసైడర్లో టీమిండియా హిస్టరీ రిపీట్ చేస్తుందా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
OTT Netflix: టాలీవుడ్ పై నెట్ ఫ్లిక్స్ భారీ పెట్టుబడి.. ఒకేసారి 16 సినిమాలు!
రాబోయే రోజుల్లో ఓటీటీ సామ్రాజ్యం మరింత విస్తరించబోతున్నట్లు అర్థమవుతుంది.. వీలైనంతవరకూ చాలా సినిమాలను ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదల చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నిర్మాతలను టెంప్ట్ చేసే ఆఫర్లు కూడా చేస్తున్నారు. ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత వీలైనంత తొందరగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో సినిమాలను స్ట్రీమింగ్ చేసేందుకు నిర్మాతలకు భారీ ఆఫర్లతో వల వేస్తున్నారు. ఇక ఇటీవల నెట్ ఫ్లిక్స్ అయితే ఒకేసారి ఏకంగా 16 సినిమాలకు సంబంధించిన ఓటీటీ హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నెట్ ఫ్లిక్స్ బిగ్ ప్లాన్
నెట్ ఫ్లిక్స్ ఈసారి టాలీవుడ్ ఇండస్ట్రీపై పెద్ద మొత్తంలో సినిమాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. క్రేజీ ప్రాజెక్టులతో పాటు మంచి కంటెంట్ ద్వారా తెరకెక్కే చిన్న సినిమాల ఓటీటీ హక్కులపై కూడా ఈ సంస్థ ఫోకస్ చేసింది. ముఖ్యంగా RRR సినిమా నుంచి టాలీవుడ్ పై నెట్ ఫ్లిక్స్ అయితే చాలా ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతుంది.

మహేష్ మెగా ప్రాజెక్టులు
ముందుగా పెద్ద ప్రాజెక్టులపైనే ఈ సంస్థ టార్గెట్ చేసింది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే SSMB28వ సినిమా తోపాటు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ను కూడా భారీ ఆఫర్ తో కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఈ సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మహేష్ బాబు సినిమా దసరా తర్వాత వచ్చే అవకాశం ఉంది.

నాని బిగ్ మూవీ
అలాగే నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న దసరా సినిమా ఓటీటీ హక్కులను కూడా ఈ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాని కొత్తగా కనిపించబోతున్నాడు. కీర్తి సురేష్ మేయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని తెలిసిందే. ఈ సినిమా హక్కులను మొదట హాట్ స్టార్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేసింది. కానీ నెట్ ఫ్లిక్స్ పోటీ పడి ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది.

రీసెంట్ బాక్సాఫీస్ హిట్స్
ఇక రవితేజ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ధమాకా సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లోనే రాబోతోంది. అలాగే నిఖిల్ సిద్ధార్థ నటించిన 18 పేజెస్ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ రచనలో వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మరికొన్ని క్రేజీ సినిమాలు
ఇక
అనుష్క
శెట్టి
నుంచి
రాబోయే
తదుపరి
సినిమా
ఓటీటీ
హక్కులను
కూడా
సొంతం
చేసుకున్నారు.
ఈ
సినిమాలో
నవీన్
పోలిశెట్టి
కథానాయకుడుగా
కనిపించబోతున్నాడు.
అలాగే
వరుణ్
తేజ్
12వ
సినిమాతో
పాటు
వైష్ణవ్
తేజ్
నాలుగో
సినిమా
ఓటీటీ
హక్కులను
కూడా
ఈ
సంస్థ
భారీ
దరకు
కొనుగోలు
చేసినట్లు
సమాచారం.
అలాగే
డీజే
టిల్లు
స్క్వేర్
రైట్స్
కూడా
ఈ
సినిమా
చేజిక్కించుకుంది.

థ్రిల్లర్, కామెడీ సినిమాలు
సాయిధరమ్ తేజ్ నటించిన వీరుపాక్ష అనే థ్రిల్లర్ మూవీ తో పాటు కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ అనే సినిమా కూడా ఈ ప్లాట్ ఫామ్ లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సినిమా షూటింగ్స్ మొదలైనప్పుడే నెట్ ఫ్లిక్స్ నిర్మాణ సంస్థలకు ఒక డీసెంట్ ఎమౌంట్ ఆఫర్ చేసి రైట్స్ దక్కించుకుంది. ఇక నాగ శౌర్య నుంచి వచ్చే మరో సినిమా ఓటిటి హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.