Ghaati OTT Release: ఓటీటీలో అనుష్క శెట్టి ఘాటి రికార్డు.. ఎన్ని కోట్లకు అమ్ముడైందో తెలుసా?
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ కు స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించడం విశేషం. వీరి కాంబినేషన్ లో గతంలో వేదం అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో అనుష్క శెట్టి ఛాలెంజింగ్ పాత్రలో నటించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత దర్శకుడు క్రిష్, అనుష్క శెట్టి కాంబినేషన్ లో పెద్దగా సినిమాలు రాలేదు. ఇక వేదం సినిమా తర్వాత 15 ఏళ్లకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిష్, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో ఘాటి చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది.
ఘాటి చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. అయితే ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందనను లభించుకుంటోంది. ఏర్లీ టాక్ ప్రకారం సినిమా బాగుందని తెలుస్తోంది. అయితే ఘాటి చిత్రం ఓటీటీ విడుదల ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తకర్తంగా మారింది. కాగా చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా ఘాటి చిత్రం ఓటీటీ విడుదల అక్టోబర్ 2వ వారంలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఘాటి చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని రూ.36 కోట్లతో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల్లో ఈ చిత్రానికే ఎక్కువ ధర చెల్లించారని తెలుస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు ఫీమేల్ లీడ్ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఓటీటీ ధర తక్కడం ఇదే తొలిసారి అని నిపుణులు తెలుపుతున్నారు.
ఓటీటీలో భారీ ధరను అందుకున్న ఈ చిత్రం ఇక బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల ఓపెనింగ్ ను అందుకుంటుందనేది చూడాలి. ఈ సినిమాకు ఫస్ట్ డే వసూళ్లు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మాతలు ఎదుగురు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్ల ముడి రూపొందించారు. ఈ చిత్రానికి రూ.100 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
ఇక బాహుబలి చిత్రం తర్వాత అనుష్క శెట్టి సినిమాల జోరును తగ్గించింది. చివరిగా మిస్ట్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ఘాటితో మళ్లీ దర్శనం ఇచ్చింది. ఈ చిత్రంలో అనుష్క శెట్టితో పాటు విక్రమ్ ప్రభు, తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగవెల్లి విద్యా సాగర్ సంగీతం అందించారు. చింతకింది శ్రీనివాస్ రావు కథను అందించగా క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











