Don't Miss!
- News
ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Major OTT Release Date: అనుకున్న డేట్ కంటే ముందుగానే వస్తున్న మేజర్.. ఎప్పుడంటే?
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరేకెక్కిన మేజర్ సినిమా జూన్ 3వ తేదీన థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. అడవిశేష్ మేజర్ పాత్రలో నటించి ఎంతగానో మెప్పించాడు. ఇక ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది హిందీలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. నిర్మాతలు డబుల్ ప్రాఫిట్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాను మహేష్ బాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. శశి కిరణ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించగా అడవి శేష్ రైటర్ గా కూడా వర్క్ చేయడం విశేషం. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అయితే భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇటీవల కాలంలో అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో ఒకటిగా మేజర్ సినిమా నిలిచింది. అయితే మేజర్ సినిమాను ఓటీటీ కూడా చూడాలి అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే అనుకున్న డీల్ ప్రకారం కంటే ముందే ఈ సినిమాను ఓటీటీ లోకి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు కరెక్ట్ గా నెల రోజులు అయిన తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తుండటం విశేషం. జూలై నెల 3వ తేదీ నుంచి ఇండియాలోని నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతోంది.
తప్పకుండా సినిమా ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంటుంది అని అనిపిస్తుంది. ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించిన విధానానికి పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు సినిమాలో అతని జీవితం మొత్తాన్ని కూడా చాలా అందంగా చూపించినట్లు ప్రముఖ దర్శకులు కూడా కొనియాడారు. ఇక ఓటీటీ లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. మరోవైపు హాట్ స్టార్ లో విక్రమ్ సినిమా జూన్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.