twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2: ప్రభాస్ ఎపిసోడ్ వలన ఎన్ని కోట్ల ఆదాయామో తెలుసా.. ఆహా జాక్ పాట్!

    |

    అన్ స్టాపబుల్ సీజన్ 2 అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. మొదటి సీజన్ కంటే ఈసారి గెస్ట్ ల సంఖ్య మరింత ఎక్కువ కావడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ కూడా రావడంతో ఒక్కసారిగా రేంజ్ పెరిగిపోయింది. అంతేకాకుండా ఈసారి సబ్ స్క్రైబర్స్ కూడా చాలా వరకు పెరిగిపోయారు. ఇక అన్ని రకాలుగా
    అన్ స్టాపబుల్ షోకు ఆదాయం పెరిగింది. అయితే కేవలం ప్రభాస్ ఎపిసోడ్ ద్వారానే అత్యధిక స్థాయిలో ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కు మంచి ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    మరోసారి నమ్మకంతో..

    మరోసారి నమ్మకంతో..

    నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో పేరుకు తగ్గట్టుగానే ముందుకు కొనసాగుతోంది. మొదటి సీజన్ కే ఈ టాప్ షోకు ముగింపు పలకబోతున్నారు అని టాక్ వచ్చింది. కానీ ఆహా మాత్రం బాలయ్య బాబు మీద మరోసారి నమ్మకంతో సెకండ్ సీజన్ ను మరింత అద్భుతంగా మొదలుపెట్టారు. ఇక ఈసారి కూడా ఊహించని స్థాయిలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

    రేంజ్ పెరిగింది

    రేంజ్ పెరిగింది

    బాలయ్య బాబు మిగతా హీరోలతో ఎలా ఉంటారో ఈ షో ద్వారా మరోసారి అర్థమయింది. ఆయనతో ఒక్కసారి మాట్లాడితే ఎంతగా కనెక్ట్ అవుతారో కూడా చాలా ఈజీగా అర్థమయింది. అంతే కాకుండా బాలకృష్ణ ఆడియెన్స్ పై చూపించే ప్రేమ కూడా అదే విధంగా ఉంటుంది అని ఈ షో ద్వారా రుజువైంది. ఒక విధంగా బాలయ్య రేంజ్ పెరగడానికి కూడా అన్ స్టాపబుల్ షో చాలా బాగా ఉపయోగపడుతుంది.

    షాకింగ్ రెమ్యునరేషన్

    షాకింగ్ రెమ్యునరేషన్

    ఇక అన్ స్టాపబుల్ మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ కే బాలయ్య బాబు అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ పొందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈసారి అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ కూడా 10 ఎపిసోడ్స్ తో పూర్తి చేసుకోబోతోంది. అయితే ఈసారి బాలయ్య బాబుకు ఆహా నుంచి 10 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది.

    ప్రభాస్ ఎపిసోడ్

    ప్రభాస్ ఎపిసోడ్

    ప్రభాస్ ఎపిసోడ్ ద్వారా కూడా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కు మంచి ఆదరణ పెరిగింది. ఒక విధంగా గతంలో కంటే ఎక్కువ స్థాయిలో ఈసారి సబ్ స్క్రిబర్స్ పెరిగారు అని తెలుస్తోంది. ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు కూడా బాలయ్య బాబుతో ఒకవైపు అల్లరి చేస్తూనే మరోవైపు వారి కెరీర్ గురించి ఎమోషనల్ గా తెలియజేశారు. దీంతో ఎపిసోడ్ కు అత్యధిక స్థాయిలో క్రేజ్ వచ్చింది.

    ఊహించని ఆదాయం

    ఊహించని ఆదాయం

    అయితే అన్ స్టాపబుల్ షోకు ఈసారి ఊహించని స్థాయిలోనే ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ గోపీచంద్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విభజించారు. ఇక ముఖ్యమైన తొమ్మిది ప్రైవేట్ కంపెనీలో బ్రాండ్స్ ఈ ఎపిసోడ్ కు స్పాన్సర్ చేశాయి. టైటిల్ లోగోలు యాడ్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఆహా కు దాదాపు 15 నుంచి 20 కోట్ల మధ్యలో ఆదాయం మిగిలినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. మరి అప్పుడు ఏ స్థాయిలో ప్రాఫిట్స్ వస్తాయో చూడాలి.

    English summary
    Aha Unstoppable with nbk 2 prabhas episode shocking revenue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X