Akhanda 2 OTT: రికార్డ్ ధరకు అఖండ 2 ఓటీటీ రైట్స్.. బాలయ్య కెరీర్‌లోనే హయ్యెస్ట్, ఎన్ని కోట్లంటే?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలవడంతో పాటు ముగిసిపోయిందనుకున్న బాలయ్య కెరీర్‌ను తిరిగి నిలబెట్టింది. ఈ నేపథ్యంలో నాలుగోసారి బాలకృష్ణను డైరెక్ట్ చేస్తున్నారు బోయపాటి. అదే అఖండ 2. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కుమార్తె తేజస్విని సమర్పణలో బాలయ్య
14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Akhanda 2 OTT Release Netflix acquired Nandamuri Balakrishna Movie s Digital Rights

అఖండ 2 రిలీజ్ వాయిదా
తొలుత దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవల్‌లో అఖండను విడుదల చేస్తామని నిర్మాతలు అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ రిలీజ్ కానుండటంతో అఖండ వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. దీనిని నిజం చేస్తూ అఖండను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమయానికి పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు మరింత నాణ్యమైన రీ రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ హంగుల్ని జోడించడం కోసం సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఫిలింనగర్‌‌లో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని బట్టి డిసెంబర్‌‌లో అఖండ 2 ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్నారు.

అఖండ 2కు అదిరిపోయే బిజినెస్?
ఇదగతంలో వచ్చిన అఖండ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు భారీగా లాభాలను అందుకోవడంతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఇక సెట్స్ మీద ఉండగానే అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌కు దుమ్మురేపుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్, ఓటీటీ రైట్స్ సొంతం చేసుకునేందుకు బడా సంస్థలు క్యూకడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అఖండ 2కి భారీ ఓటీటీ డీల్
అఖండ 2 డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థల మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 80 కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకుని బిజినెస్ క్లోజ్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అఖండ 2పై నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో భారీ ధర చెల్లించి ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఏమాత్రం వెనుకాడలేదని తెలుస్తోంది. ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక మొత్తంలో ఓ సినిమాకు డిజిటల్ రైట్స్ బిజినెస్ జరగడం ఇదే తొలిసారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే అఖండ 2 విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X