Don't Miss!
- Sports
INDvsAUS : వాళ్లకు కూడా గాయాలైతే సిరీస్ ముగిసినట్లే.. ఆసీస్ టెస్టులపై పేలుతున్న మీమ్స్!
- News
సెల్ఫీ వీడియో తీసుకుని బీజేపీనేత ఆత్మహత్య.. ఎన్నికల ఓటమి, వారి వేధింపులే కారణం!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Deepika Pilli: దీపిక పిల్లికి ముద్దు పెట్టబోయిన డైరెక్టర్.. ఆ బాత్రూమ్ గొడవ ఏమిటంటే?
ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. విభిన్నమైన కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా పలు షోలు కూడా నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. రియాలిటీ షో, టాక్ షో, డ్యాన్స్ షో అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆడియెన్స్ నవ్వించేందుకు కామెడీ షోలు సైతం వస్తున్నాయి. ఇక ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ముందుకు వస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ వేదిక ఆహా. ఈ ప్లాట్ ఫామ్ వేదికపై త్వరలో స్ట్రీమింగ్ కానున్న షో.. కామెడీ స్టాక్ ఎక్చేంజ్. ఈ షోకి యాంకర్స్ గా దీపిక పిల్లి, సుడిగాలి సుధీర్ వ్యవహరించారు.

సరికొత్త కాన్సెప్ట్స్ తో..
ఇప్పటికీ బుల్లితెరపై కామేడీ షోలు తెగ సందడి చేశాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోందన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో తెలుగు ఓటీటీ వేదికగా ప్రేక్షకులు మన్ననలు పొందుతోంది ఆహా. సరికొత్త కాన్సెప్ట్స్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసే పనిలో పడింది.

యాంకర్ గా దీపిక పిల్లి..
ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో భాగంగానే ఓ కామెడీ షోను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో బుల్లితెరపై కమెడియన్లతో నవ్వులు పంచనుంది. ఆహా ఓటీటీ వేదిక అందిస్తున్న సరికొత్త కామెడీ ఎంటర్టైన్ మెంట్ షో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ షోకి ఛైర్మన్ గా సరిలేరు నీకెవ్వరు, F2, F3 చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి యాంకర్స్ గా అలరించనున్నారు.

టాప్ స్టాక్ గా పేరు..
ఇక సెలబ్రిటీ కమెడియన్స్ అయిన వేణు, అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్, యాదమ్మ రాజు స్టాక్స్ గా ఉండనున్నారు. ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో మూడు రౌండ్స్ ఉండనున్నాయి. ఇందులో కమెడియన్స్ స్టాక్స్ గా ఉంటారు. అలాగే ఇన్వెస్టర్లుగా ఆడియెన్స్ ఉంటారు. అంటే స్టాక్స్ కు ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. అక్కడ ఎక్కువ ఓట్లు గెలుచుకున్న వారు ఛైర్మన్ మనసు గెలుచుకుని టాప్ స్టాక్ గా పేరు తెచ్చుకుంటారు.

విద్యార్థులుగా కమెడియన్స్..
ఆహా ఓటీటీ వేదిక అందిస్తున్న సరికొత్త కామెడీ ఎంటర్టైన్ మెంట్ షో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ 10 ఎపిసోడ్స్ గా సాగనుంది. ఆహాలో డిసెంబర్ 2 నుంచి ఈ నవ్వుల షో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది ఆహా. ఈ ప్రోమోలో ఒక్కొక్క కమెడియన్ వివిధ గెటప్పులో ఎంట్రీ ఇవ్వడం చూడొచ్చు. అలాగే క్లాస్ రూమ్ స్కిట్ లో విద్యార్థులుగా కమెడియన్స్ డ్యాన్స్ చేశారు.

దీపిక పిల్లికి డైరెక్టర్ ముద్దు..
యాంకర్ సుధీర్ కి యాదమ్మ రాజు ముద్దు పెడుతూ కనిపించాడు. అలాగే ఈ ప్రోమోలో యాంకర్ దీపిక పిల్లిని డైరెక్టర్ అనిల్ రావిపూడి ముద్దు పెట్టుకోబోతుండటాన్ని చూపించారు. అనిల్ రావిపూడి అలా వస్తుంటే దీపిక నవ్వుతూ కనిపించింది. దీని తర్వాత స్టేజిపైకి ఎక్స్ ప్రెస్ హరి వచ్చి స్కిట్ చేశాడు. వాళ్ల క్లాస్ లో రాము అనే వ్యక్తికి రమ్య అనే అమ్మాయి నచ్చడంతో ఫ్లేమ్స్ గేమ్ వేశాడని చెప్పాడు హరి.
అలా వచ్చేదాకా..
వాళ్ల ఫ్రెండ్ రాము.. రమ్య కోసం ఫ్లేమ్స్ వేస్తే సిస్టర్ వచ్చిందని చెప్పాడు ఎక్స్ ప్రెస్ హరి. దీంతో అందరూ ఏ సిస్టర్ వచ్చిందని ఎగతాళి చేశారన్నాడు. దానికి వాళ్ల ఫ్రెండ్.. "ఊరుకో బ్రో.. నా పేరు రాము కాదు.. పోలుపర్తి రాము" అని అన్నాడని హరి చెప్పగానే అందరూ నవ్వేశారు. "ఆ పేరుతో ఫ్లేమ్స్ వేస్తే.. ఎనిమీ (శత్రువు) వచ్చింది. చివరికీ మ్యారేజో.. లవ్వో.. వచ్చేదాకా వాడు రాము అనే పేరును బాత్రూమ్ అయినా మార్చుకుంటాడు" అని అందరినీ తెగ నవ్వించేశాడు ఎక్స్ ప్రెస్ హరి. అనంతరం ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమదైన స్టైల్ లో కామెడీ పండించి నవ్వించారు.