Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
గమ్మత్తైన కథతో అలరించేందుకు సిద్ధమైన బీఎఫ్ఎఫ్
తెలుగు వెబ్ సిరీస్ కు సరికొత్త జీవం పోస్తున్న ఆహా తాజాగా మరోక ఆహ్లాదకమైన వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆద్యంతం వినోదభరితమైన బీఎఫ్ఎఫ్ త్వరలోనే ఆహా ఓటీటీలో విడుదలవ్వబోతోంది. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అడల్టింగ్ అనే వెబ్ సిరీస్ స్ఫూర్తితో రూపొందిన బీఎఫ్ఎఫ్ అదే స్థాయిలో రింజింపజేయబోతోందని అర్ధమవుతోంది.
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన బీఎఫ్ఎఫ్, నేటి మోడ్రన్ యువత లైఫ్ స్టైల్ ను స్మాల్ స్క్రీన్ పైన ఆవిష్కరించబోతోంది. హైదరాబాద్ మెట్రో సిటీలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరు యువతుల మధ్య స్నేహగీతం, వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే అసలు కథ. నేటి తరం అమ్మాయిలు ప్రేమ, పెళ్లి, ఉద్యోగం వంటి కీలక ఘట్టాలను తమదైన స్టైల్ లో ఎలా హ్యాండిల్ చేశారు అన్నదే కీలకం. ఆహా, డైస్ మీడియా సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.

ఇటీవలే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించగా బీఎఫ్ఎఫ్ యూనిట్ మొత్తం కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆహా సీఈఓ అజిత్ కే ఠాకుర్ మాట్లాడుతూ నేటి యువతకు ప్రతిబింబమైన ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు.
ఇక సిరీస్ లో లీడ్ రోల్స్ చేస్తున్న సిరి హనుమంత్, రమ్య పసుపలేటి సిరీస్ ద్వారా మంచి నటిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా, తమ పాత్రలు అందరికీ దగ్గర అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏమైనా అందమైన ఈ ఇద్దరమ్మాయిల కథ ప్రేక్షకులను అలరించేందుకు మే 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. మరి ఈ బీఎఫ్ఎఫ్ లు అనుకున్నది సాధిస్తారేమో చూడాలి.