For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: బాబా భాస్కర్‌కు బంపర్ ఆఫర్.. వైల్డ్ కార్డ్‌తో వచ్చినా టైటిల్ బరిలోనే!

  |

  తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలోనే ఎన్నో రకాల కార్యక్రమాలు పరిచయం అయ్యాయి. అయితే, అందులో కొన్నింటిని మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ షో ఒకటి. పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి భారీ రెస్పాన్స్ దక్కింది. అందుకే మన షో జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకుంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను మొదలు పెట్టారు. ఇది కూడా ఆరంభం నుంచే ఆదరణను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇందులో బాబా భాస్కర్‌కు అదిరిపోయే ఛాన్స్ దక్కింది.

  బాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోత

  గత వారం మొత్తం బిగ్ బాస్ హౌస్‌లో 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' కోసం టాస్కును నిర్వహించారు. దీనిని నిర్వహించేందుకు గానూ గత సీజన్‌లో టాప్ 5కు వచ్చిన కంటెస్టెంట్లను షోలోకి తీసుకు వచ్చారు. ఇందులో భాగంగానే మొదటి రోజు సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరితోనూ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునేందుకు గానూ టాస్కులు ఆడించింది. ఆ తర్వాత రోజు మానస్ కూడా లోపలికి వచ్చి కొన్ని టాస్కులు ఇచ్చాడు. మూడో రోజు యాంకర్ రవి కూడా ఇందులోకి అడుగు పెట్టి రచ్చ రచ్చ చేసేశాడు. ఇక, నాలుగో రోజు ఈ టాస్కులు ఆడించేందుకు గానూ షణ్ముఖ్ జస్వంత్ ఎంటరైన విషయం తెలిసిందే.

   Bigg Boss Non Stop: Baba Baskar Won Eviction Free Pass Task

  'ఎవిక్షన్ ఫ్రీ పాస్' కోసం జరిగిన టాస్కుల్లో తుది పోరుకు అర్హత సాధించిన వాళ్లకు ఫైనల్ టాస్క్ ఇచ్చేందుకు గానూ గత సీజన్ విన్నర్ వీజే సన్నీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యాడు. పాస్‌ను చేత పట్టుకుని లోపలికి అడుగు పెట్టిన అతడు ఆరంభం నుంచే అదిరిపోయే టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు, ఫినాలే రౌండ్‌కు అర్హత సాధించిన వాళ్లతో గేమ్ ఆడించాడు. ఇందులో చివరి వరకూ అద్భుతంగా ఆడిన బాబా భాస్కర్‌ విజయం సాధించాడు. తద్వారా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అత్యంత ముఖ్యమైన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను సొంతం చేసుకుని.. ఫినాలే బెర్తును బుక్ చేసుకుని పెట్టుకున్నాడు.

  Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్‌ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ తుది దశకు చేరుకుంటోన్న సమయంలో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాబోయే ఎపిసోడ్‌లో 'ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌' టాస్కును తీసుకుని వచ్చారు. ఇందులో గెలిచిన సభ్యుడు లేదా సభ్యురాలికి ఎలిమినేషన్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్లు ఎప్పుడైనా వాడుకోవచ్చు. గతంలోనూ ఇది చూపించారు. ఇక, ఈ సీజన్‌లో బాబా భాస్కర్ విజయం సాధించడంతో.. ఆయన ఎలిమినేషన్ తప్పించుకునే ఛాన్స్ దక్కింది. ఈ వారం ఆయన ఎలాగో నామినేషన్స్‌లో లేడు. దీంతో వచ్చే వారం దీన్ని ఉపయోగించుకుని నేరుగా ఫినాలేలో అడుగు పెట్టే అవకాశం పొందాడు.

  వాస్తవానికి బాబా భాస్కర్ రెండు వారాల క్రితమే వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే కెప్టెన్ అయిన ఆయన.. ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు. దీంతో నేరుగా ఫినాలేలో అడుగు పెట్టబోతున్నాడు. ఇదే జరిగితే మధ్యలో వచ్చి ఫినాలేకు వెళ్లిన కంటెస్టెంట్‌గా ఆయన నిలవబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈరోజు జరిగే ఎలిమినేషన్‌లోనూ బాబా భాస్కర్ ఈ పాస్‌ను ఉపయోగించే చాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో!

  English summary
  Bigg Boss Telugu Unit Now Started Non Stop OTT First Season. Baba Baskar Won Eviction Free Pass Task In This Season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X