For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: బిగ్ బాస్‌ బండారం బయట పెట్టిన మహేశ్.. అందుకే మా ముగ్గురి ఎలిమినేషన్ అంటూ!

  |

  ఎన్నో సందేహాల నడుమ మొదలై.. చాలా తక్కువ సమయంలోనే సక్సెస్‌ఫుల్ షోగా మారిపోయింది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా.. కొత్త కొత్త గేమ్‌లతో సాగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగుతోంది. అంతేకాదు, నిత్యం గొడవలు, కొట్లాటలు, లవ్వాటలు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్‌ను కూడా ఇందులో చూపించడంతో మరింత వినోదం దక్కుతోంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో మాత్రం ఊహించని కంటెస్టెంట్ల ఎలిమినేషన్స్‌ షాకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎలిమినేట్ అయిన మహేశ్ విట్టా బిగ్ బాస్ తీరుపై సంచలన ఆరోపణలు చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  మరింత బోల్డుగా నడిస్తున్నారుగా

  మరింత బోల్డుగా నడిస్తున్నారుగా

  తెలుగులో బిగ్ బాస్ షోకు ఆదరణ అంతకంతకూ పెరుగుతుండడంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే రంజుగా సాగుతోంది. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ, గొడవలతో రచ్చగా నడుస్తోంది. ఫలితంగా మరింత ఎక్కువగా మజాను పంచుతోంది.

  మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!

  6 వారాల్లో.. ఆరుగురు ఎలిమినేట్

  6 వారాల్లో.. ఆరుగురు ఎలిమినేట్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీళ్లలో నుంచి ఆరు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపులు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.

  అషు వల్ల... ఊహించని విధంగా

  అషు వల్ల... ఊహించని విధంగా

  బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. ఇందులో మొత్తం ఎనిమిది మంది మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయ్యారు. ఇందులో మహేశ్ మాత్రం అషు రెడ్డి స్పెషల్ పవర్‌తో బుక్కైపోయాడు.

  ప్రియుడితో ఏకాంతంగా నయనతార: ఒకే రూమ్‌లో క్లోజ్‌గా.. పర్సనల్ పిక్ బయటకు రావడంతో!

  బిగ్ బాస్ నుంచి మహేశ్ అవుట్

  బిగ్ బాస్ నుంచి మహేశ్ అవుట్

  ఏడో వారానికి సంబంధించి జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం ఎపిసోడ్‌లో చూపించారు. ఇందులో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన నటరాజ్ మాస్టర్, మహేశ్ విట్టాలు డేంజర్ జోన్‌లోకి వచ్చారు. వీళ్లిద్దరిలో కుండలు.. అందులో రంగులు అనే టాస్క్ ఆడించారు. ఇందులో రెండు ఎరుపు రంగులు వచ్చిన మహేశ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

  పుష్పాలు.. ఫైర్ ఎవరో చెప్పాడు

  పుష్పాలు.. ఫైర్ ఎవరో చెప్పాడు

  ఎలిమినేట్ అయిన తర్వాత మహేశ్ విట్టాతో నాగార్జున ఓ గేమ్ ఆడించాడు. ఇందులో హౌస్‌లో ఉన్న వారిలో పుష్పాలు ఎవరు? ఫైర్ ఎవరు అని అడిగాడు. దీనికి మహేశ్ అనిల్, అజయ్, నటరాజ్ మాస్టర్, మిత్రా, అషూ రెడ్డి, హమీదలు పుష్పాలు అని వాళ్లకు కొన్ని సలహాలు ఇచ్చాడు. అలాగే, అఖిల్, శివ, బిందు, అరియానాలు ఫైర్ అని చెప్పి వాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.

  Pooja Hegde: పూజా హెగ్డే అందాల జాతర.. ఉల్లిపొరలాంటి బట్టల్లో యమ హాట్‌‌గా!

  ఎలిమినేషన్స్‌పై మహేశ్ నిరాశ

  ఎలిమినేషన్స్‌పై మహేశ్ నిరాశ

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన మహేశ్ విట్టా.. ఆ వెంటనే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో బిగ్ బాస్ ఎలిమినేషన్స్‌పై అతడు అసహనం వ్యక్తం చేశాడు. 'అనిల్, మిత్రా సేఫ్ అవగానే ఈ వారం నేనే ఎలిమినేట్ అవుతానని అనుకున్నా. అందుకే నేనేమీ టెన్షన్ ఫీల్ అవలేదు. అయినా ఈ ట్విస్టులు కొత్తేం కాదు కదా' అన్నాడు.

  మా ముగ్గురినీ పంపించేశారుగా

  మా ముగ్గురినీ పంపించేశారుగా

  ఓవరాల్ ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుతూ.. 'గతంతో చైతూ, తేజూ ఎలిమినేట్ అయినప్పుడు యాక్టివ్‌గా ఉండే వాళ్లను పంపారు. సైలెంట్‌గా ఉండే వాళ్లను ఉంచారు అనుకున్నా. ఇప్పుడు కూడా అదే చేశారు. వాళ్లకు నచ్చిన వాళ్లను ఉంచుతున్నారు. నిజానికి వాళ్లు ముందే ఇలాంటి ఎలిమినేషన్స్ ఉంటాయని మాకు హింట్ ఇచ్చారు' అని మహేశ్ సీక్రెట్ లీక్ చేసేశాడు.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Recently Mahesh Vitta Did Sensational Comments On Eliminations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X