For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Nonstop: అన్నీ లీక్ చేసిన అనిల్ సిస్టర్.. చేయాల్సింది అంతా చేసేస్తుంది.. ఆమెతోనే ఉండమంటూ?

  |

  బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎపిసోడ్స్ అన్నీ ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రతి సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ఫ్యామిలీ ఎపిసోడ్స్ అన్నీ కూడా కొంత ఎమోషనల్గా కొంత ఎంటర్టైనింగ్ విధానంలో సాగుతున్నాయి.. ఇప్పటికే చాలా మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోపలికి వచ్చి వాళ్ళకి కాస్త బలం చేకూర్చే విధంగా మాట్లాడారు.. తాజా ఎపిసోడ్ లో అనిల్ రాథోడ్ సోదరి స్వాతి రాథోడ్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఎంట్రీ ఇవ్వడమే కాక తన తమ్ముడికి అనేక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.. ఎవరితో ఎలా ఉండాలి అంటూ ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు కూడా పెద్దగా లీకులు ఇవ్వలేదు. కానీ స్వాతి మాత్రం దాదాపుగా ఎవరితో ఎలా ఉండాలి ఎవరు రైజింగ్ లో ఉన్నారు అనే విషయాలు అర్థం అయ్యే విధంగా చెప్పేసింది.. వివరాల్లోకి వెళితే

   తమ్ముడితో ఏకాంతంగా

  తమ్ముడితో ఏకాంతంగా


  ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో భాగంగా అనిల్ రాథోడ్ సోదరి స్వాతీ రాథోడ్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు.. ఆమె వచ్చి రావడం తోటే బాబా భాస్కర్ ఆమెకు కాఫీ ఇవ్వడంతో వీరు ఇలా లోపలికి వచ్చిన అందరికీ అతిథి సత్కారాలు చేయడం నాకు బాగా నచ్చింది అని చెప్పుకొచ్చింది.. ఆ తర్వాత మిత్రశర్మ స్వాతి తో మాట్లాడుతూ మీరు చాలా అందంగా ఉన్నారు మీరు నవ్వితే ఇంకా బాగున్నారు అనడంతో ఆమె చాలా ఆనంద పడి థాంక్స్ అని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళింది. ఇక తన తమ్ముడితో ఏకాంతంగా కూర్చుని మాట్లాడుతూ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, అంతా బాగుంది కాకపోతే ఇంకా కొన్ని మార్పులు చేసుకోవాలని ఆమె చెప్పుకొచ్చింది. నువ్వు ఇంత వరకూ ఈ స్టేజ్ అదే ఈ ప్లాట్ఫారం వరకు రావడానికి ఎంత కష్టపడ్డావు అని ప్రశ్నిస్తే అనిల్ రాథోడ్ ఆలోచనలో పడ్డాడు.

   వాయిస్ ముఖ్యమని

  వాయిస్ ముఖ్యమని


  నీ డెడికేషన్ లెవల్ ఎలాంటిది? ఉదయం 6 గంటలకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాలుగు గంటలకే లేచి రెడీ గా ఉండే వాడివి కానీ ఇక్కడ నువ్వు అనుకున్న దానికి దగ్గరగా వెళుతున్నావు కానీ ఇబ్బంది పడుతున్నావు అని ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకు అలా అని ప్రశ్నించడంతో అనిల్ రాథోడ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా నువ్వు నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో దాన్ని బలంగా బయటకు చెప్పలేకపోతున్నావు అని ఆమె చెప్పుకొచ్చింది.. నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పడం లేదు నీ వాయిస్ అస్సలు బయటికి వినిపించడం లేదు అని ఆమె చెప్పుకొచ్చింది.. ఏదైనా సంభాషణ జరుగుతున్న సమయంలో నువ్వు ఏదైనా పాయింట్ చెప్పావు అనుకో ఆ పాయింట్ అవతలి వాళ్ళకి చేరాలి అంటే వాయిస్ ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు.

   అనిల్ రాథోడ్ అంటే టాస్క్

  అనిల్ రాథోడ్ అంటే టాస్క్


  ఓపెన్ అవ్వడం అంటే అదేనని ఇకమీదట జాగ్రత్తగా ఉండమని సూచించింది.. సరేగాని నువ్వు బయటకు వచ్చాక నీకు ఒక అద్భుతమైన వీడియో చూపిస్తాను నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు అని అడిగింది.. నువ్వు ఏదంటే ఆ గిఫ్ట్ ఇస్తానని అనిల్ రాథోడ్ చెప్పుకొచ్చాడు. అయితే ఏమిటి ఆ వీడియో అని అడగడంతో నువ్వు బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన రోజు నాన్న చేసిన హంగామా అంతా ఇంతా కాదు డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఆయన బాగా ఎంజాయ్ చేశారని అది నీ లైఫ్ మొత్తానికి ఒక మెమరీ అని చెప్పుకొచ్చింది. ఇక నువ్వు టాస్క్ లో బాగా ఆడుతున్నావు టాస్క్ అంటే అనిల్ రాథోడ్, అనిల్ రాథోడ్ అంటే టాస్క్ అన్నట్లు ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్ లు అందరితో స్వాతి మాట్లాడింది.

   మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేసి

  మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేసి


  తాను ఈ హౌస్ లోపలికి రావడానికి కారణం తన తమ్ముడు అయితే తన తమ్ముడు ఈ హౌస్ లోపలికి రావడం బిగ్ బాస్ అని కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యానికి, నాగార్జున గారికి ధన్యవాదాలు అని స్వాతి చెప్పుకొచ్చింది.. ఇక బయట ఉన్న వాళ్ళకి ఫన్ అనిపించేది మీ నామినేషన్స్ అని ఆమె చెప్పుకొచ్చారు. మేము ఇంత కొట్టుకుంటుంటే ఈవీడేంటి ఎంజాయ్ చేస్తున్నాం అని అంటుంది అని హౌస్ సభ్యులు ఒక నిమిషం పాటు షాక్ అయ్యారు. తర్వాత వాళ్లందరికీ కూడా విషయం అర్థమైంది. ఈ సందర్భంగా కొంతమంది హౌస్ మేట్స్ నామినేషన్ సమయంలో ఎలా ప్రవర్తిస్తారు అనేది వాళ్ళ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేసి చూపించారు స్వాతి.

  ఆమెతో జాగ్రత్త

  ఆమెతో జాగ్రత్త


  ఆ తర్వాత కు మిగతా హౌస్ సభ్యులతో కాసేపు సందడి చేసిన స్వాతి తన తమ్ముడితో మాత్రం బిందు, శివ నువ్వు కలిసి ఉన్న కాంబినేషన్ చాలా బాగుంది అవసరమైతే వాళ్ళ కోసం కూడా నువ్వు స్టాండ్ తీసుకోమని సలహా ఇచ్చింది. అంతేకాక అషు రెడ్డి నీతో బాగానే ఉన్నట్టు ఉంటుంది కానీ వెనుక మాట్లాడాల్సినవి మాట్లాడుతుంది ఆమెతో జాగ్రత్తగా ఉండమని సూచించింది. అలాగే నటరాజ్ మాస్టర్ తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని సూచించింది. అయితే బిందుతో క్లోజ్ గా ఉండు అని ఒకటికి రెండు సార్లు చెప్పి ఆమె స్ట్రాంగ్ గా ఉంది. ఆమెతోనే ఉండమని సలహా ఇచ్చేసింది స్వాతి. మరి అక్క సలహాను తమ్ముడు ఏ మేరకు వాడుకుంటాడు? అనేది చూడాలి మరి.

  English summary
  Anil Rathod's sister leaks crucial information to her brother in Bigg Boss Nonstop
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X