Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: అతనికి 50-50 ఛాన్సెస్, ఆమె వల్లే బయటకొచ్చా.. షానీ షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఇక చివరి దశకు చేరుకుంది. 14వ వారం కూడా పూర్తి కానుంది. ఈ వారం అంతా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించుకునేందుకు ఛాలెంజ్ లు ఇచ్చారు. ఇందులో భాగంగానే గత ఎపిసోడ్ లో సీన్ రీక్రియేషన్ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యుల పర్ఫామెన్స్ బిగ్ బాస్ మెచ్చి మొత్తంగా రూ. 47 లక్షలుగా ప్రైజ్ మనీ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా బీబీ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు 6 మొదటి వారంలో ఎలిమినేట్ అయిన షానీ సాల్మన్ అతిథిగా హాజరయ్యాడు. అతన్ని బోల్డ్ బ్యూటి అరియానా గ్లోరి ఇంటర్వ్యూ చేసింది.

మాజీ కంటెస్టెంట్ షానీ సాల్మన్ హాజరై..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బీబీ కేఫ్ కు ప్రస్తుత సీజన్ మాజీ కంటెస్టెంట్ షానీ సాల్మన్ హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

ఈ వీక్ వరకు వస్తారని..
షానీ సాల్మన్ ను ఇన్వైట్ చేసిన అరియానా గ్లోరి అతనితో కలిసి డ్యాన్స్ చేసింది. నీ ప్రకారం సీజన్ 6 టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు అని అరియానా అడగ్గా.. ఫస్ట్ నుంచి కొందరిని అనుకున్నాను అన్నట్లుగా చెప్పినట్టున్నాడు షానీ. అతను చెప్పే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచారు. మీ గెస్ ప్రకారం లాస్ట్ లో ఎవరు ఉండొచ్చు అని మళ్లీ అరియానా అడగ్గా.. దానికి కూడా సస్పెన్స్ మ్యూజిక్ యాడ్ చేసి రివీల్ చేయలేదు. ఈ వీక్ వరకు వస్తారని గట్టి నమ్మకం అని ఎవరి గురించో చెప్పడం మాత్రం ప్రోమోలో చూపించారు.

టాప్ 5లో కీర్తి ఉంటుంది..
కీర్తిని శ్రీసత్య ఇమిటేట్ చేసినప్పుడు మీకు ఏమనిపించిందని షానీని అడిగింది అరియానా గ్లోరి. బెసికల్ గా తప్పు చేసిందనే అనిపించింది నాకు అయితే. రేవంత్ అనే వ్యక్తి స్వతహాగా షార్ట్ టెంపర్ మనిషి అని షాకింగ్ కామెంట్స్ చేశాడు షానీ సాల్మన్. ర్యాంకింగ్ టాస్క్ లో కీర్తిని 6, 7 స్థానంలోనే పెట్టాలని చూశారు హౌజ్ మేట్స్ అని అరియానా అంటే.. నిజానికి టాప్ 5లో కీర్తి ఉంటుందని నాకు గట్టి నమ్మకం అని షానీ సాల్మన్ పేర్కొన్నాడు.

అతనికి 50-50 ఛాన్సెస్..
తర్వాత షానీ సాల్మన్ కి లైక్ ఆర్ డిస్ లైక్ టాస్క్ ఇచ్చారు. ఇందులో శ్రీహాన్ ఫొటో చూపించారు. దీంతో శ్రీహాన్ కు 50-50 అని చెప్పొచ్చు అని షానీ అంటే.. అలా 50-50 లేదు. ఏదో ఒకటే చెప్పాలి అని అరియానా అన్నట్లుగా వీడియో అయితే కనిపించింది. తర్వాత శ్రీహాన్ ఒక మంచి కంటెస్టెంట్ అని షానీ అంటే.. అదంతా చెప్పొద్దు.. అలాంటివి చెప్పకుండా నేరుగా పాయింట్ చెప్పండని అరియానా అసహనంతో అడిగినట్లు చూపించారు.

ఆమె వల్లే నేను బయటకొచ్చా..
శ్రీసత్య వల్లే నేను బయటకు వచ్చా అని షానీ సాల్మన్ అంటే అరియానా గ్లోరి నవ్వింది. ఇలా కొంచెం సస్పెన్స్ గా, మరికొంచెం రివీల్ చేస్తూ బిగ్ బాస్ కేఫ్ కు షానీ సాల్మన్ హాజరైన 84వ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ బీబీ కేఫ్ కు ఇదివరకు సిరి హన్మంతు, అర్జున్ కల్యాణ్, బాలాదిత్య, అనిల్ రాథోడ్, రివ్యూవర్ జబర్దస్త్ మహిధర్ ఇలా తదితరులు హాజరై బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్లపై ఉన్న అభిప్రాయాలను వెల్లడించారు.
నేరుగా నామినేట్..
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికీ 96 రోజులు 97 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. చూస్తుంటే ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో టైటిల్ విన్నర్ ఎవరా అని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 14వ వారం మాత్రం ఇంటి సభ్యుల్లో శ్రీహాన్ తప్పా మిగతా అందరూ నేరుగా నామినేట్ అయ్యారు. శ్రీహాన్ ఫినాలేకు వెళ్లడంతో అతన్ని నామినేట్ చేయలేదు బిగ్ బాస్. దీంతో ప్రస్తుతం నామినేషన్లలో ఆరుగురు ఉన్నారు.