Coolie on OTT: ఓటీటీలోకి కూలీ మూవీ.. రజనీకాంత్ మ్యాజిక్‌ను ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కూలీ. తమిళంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటించారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కనిపించారు.

ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని 350 కోట్ల రూపాయల బడ్జెట్‌‌తో రూపొందించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై మిక్స్‌డ్ టాక్‌తో థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఎన్ని కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఓటీటీ బిజినెస్ ఎంత? ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది అనే వివరాల్లోకి వెళితే..

Coolie Movie OTT Release date

ఇక కూలీ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తమిళంలో 150 కోట్ల రూపాయలు నెట్, తెలుగులో 70 కోట్ల రూపాయలు నెట్, కన్నడలో 45 కోట్లు నికరంగా, కేరళలో 25 కోట్ల రూపాయల, హిందీ ఇతర రాష్ట్రాల్లో 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 340 కోట్ల రూపాయలు దేశీయంగా వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కూలీ సినిమాకు నార్త్ అమెరికాతోపాటు ఇతర దేశాల్లో కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. అయితే రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆ తర్వాత క్రమేపీ వసూళ్లు సన్నగిల్లాయి. అయితే ఓవరాల్‌గా ఓవర్సీస్ మార్కెట్‌లో 180 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 520 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అయితే కూలీ సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీ రైట్స్ బిజినెస్ భారీగా జరిగింది. పలు భాషల్లో రిలీజయ్యే ఈ సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను సుమారుగా 120 కోట్ల రూపాయలు చెల్లించి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకొన్నట్టు ట్రేడ్ బజార్‌లో చర్చ జరిగింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌లో రిలీజ్‌కు సిద్దమైంది.

అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం.. నిర్ణీత ఒప్పందం కంటే ముందుగానే ఈ సినిమా ఓటీటీలో వస్తున్నట్టు సినీ పండితులు చర్చించుకొంటున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాం. ఈ చిత్రం సుమారుగా 240 దేశాల్లో స్ట్రీమింగ్ అవుతుంది అని అధికారికంగా వెల్లడించింది. ఓటీటీలో రజనీ మ్యాజిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X