Don't Miss!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Dejavu అమెజాన్ ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న డెజావు.. తెలుగులో ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?
తమిళ భాషలో మిస్టరీ, హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన డెజావు చిత్రం ఓటీటీలో భారీ రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నది. రోజా ఫేమ్ మధుబాల, అరుళ్ నిధి, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్, కాళీ వెంకట్, మైమ్ మధు నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఛానెల్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సత్తా చాటుతున్నది. వినూత్నమైన కథ, ఆసక్తిరేపే కథనంతో అనేక ట్విస్టులు, టర్న్స్‌తో రూపొందిన ఈ చిత్రానికి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రిలీజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఫలితాన్ని సాధించింది. ప్రస్తుతం డెజావు అమెజాన్‌లో రికార్డు వ్యూస్‌ను సాధిస్తున్నది.
డెజావు కథ విషయానికి వస్తే.. ఒక రచయిత రాసిన కథలోని సంఘటనలు వాస్తవం జీవితంలో కూడా జరిగితే.. ఆ పాత్రలు వచ్చి రైటర్‌ను బెదిరిస్తే అనే కాన్సెప్ట్‌తో డెజావు రూపొందింది. కిడ్నాప్, ఓ మర్డర్ గురించి జరిగే ఇన్వెస్టిగేషన్ ఆసక్తిని కలిగిస్తుంది. ఉత్కంఠగా సాగే మర్డర్ మిస్టరీ ఆకట్టుకొనేలా రూపొందించడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నారు.

2022 జూలైలో తమిళంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
ప్రస్తుతం డెజావు చిత్రాన్ని తెలుగులో రిపీట్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా డిస్నీ+హాట్ స్టార్‌లో డిసెంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, మధుబాల తదితరులు నటించారు.
నటీనటులు:
నవీన్
చంద్ర,
మధుబాల,
అచ్యుత్
కుమార్,
కాళి
వెంకట్,
మైమ్
గోపి,
స్మృతి
వెంకట్
తదితరులు
రచన,
దర్శకత్వం:
అరవింద్
శ్రీనివాసన్
నిర్మాత:
విజయ్
పాండీ,
పీజీ
ముత్తయ్య
సినిమాటోగ్రఫి:
పీజీ
ముత్తయ్య
ఎడిటింగ్:
అరుల్
సిద్దార్థ్
మ్యూజిక్:
జిబ్రాన్
బ్యానర్:
వైట్
కార్పెట్
ఫిల్స్మ్,
పీజీ
మీడియా
వర్క్స్